విజయ్ దేవరకొండ సినిమాకి అడ్డుపడుతున్న తెలంగాణ పొలిటీషియన్స్..!

By Xappie Desk, October 03, 2018 20:58 IST

విజయ్ దేవరకొండ సినిమాకి అడ్డుపడుతున్న తెలంగాణ పొలిటీషియన్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి జోరుమీదున్నాడు కుర్ర హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా మొదలుకొని బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు కొల్లగొడుతూ నైజాం మెగాస్టార్ గా బిరుదు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ..తాజాగా ఇటీవల గీత గోవిందం సినిమాతో మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల కుర్రకారు అభిమానాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన తన లేటెస్ట్ సినిమా నోటా ను ఈనెల 5వ తారీఖున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆనంద శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో రూపొందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల విజయవాడలో జరిగాయి..ఇదే క్రమంలో తాజాగా నోటా ప్రమోషన్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.
 
అయితే రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా..తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సినిమాను అడ్డుకోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నట్టు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతున్న వార్త. ఇదే క్రమంలో ఈ సినిమా రాజకీయ పార్టీలకు సంబందించిన సన్నివేశాలు ఉన్నాయని .. ఇది ఒక రాజకీయ పార్టీ తరపున ప్రచారంలా ఉంటుందంటూ మాజీ సెన్సార్ సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ చిత్రాన్ని డిజిపి చూసాకే విడుదల అనుమతి ఇవ్వాలని అయన కోరారు. మరో వైపు ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ కూడా రాజకీయ పార్టీలను కెలికేలా కామెంట్స్ చేయడంతో కొన్ని పార్టీల వారు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. గతంలో అర్జున్ రెడ్డి సినిమా విషయంలో కూడా విజయ్ దేవరకొండ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుని కెలికి వార్తల్లో నిలిచి ...అర్జున్ రెడ్డి సినిమా కి ఫ్రీ గా ప్రమోషన్ వచ్చేలా చేశారు. అయితే తాజాగా అక్టోబర్ 5న విడుదల కాబోతున్న నోటా సినిమా విషయంలో కూడా...ఇదే తరహా ఫార్ములాను హీరో విజయ్ దేవరకొండ ఉపయోగిద్దాం అనుకుంటున్నట్లు తాజా పరిణామాల బట్టి తెలుస్తుంది అని అంటున్నారు సినీ విశ్లేషకులు.


Tags :

Forum Topics


Top