సుకుమార్ - మహేష్ బాబుల సినిమాకి ఇబ్బందులు సృష్టిస్తోంది ఎవరు ?

By Xappie Desk, October 29, 2018 13:28 IST

సుకుమార్ - మహేష్ బాబుల సినిమాకి ఇబ్బందులు సృష్టిస్తోంది ఎవరు ?

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా తీసిన తర్వాత ఆ సినిమాలోని హీరో తర్వాత చిత్రం మీద అంచనాలు ఎంత అయితే ఉంటాయో దానికి రెట్టింపు అంచనాలు ఆ దర్శకుడి నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన ఉంటాయి. ఇప్పుడు రంగస్థలం దర్శకుడు సుకుమార్ అదే స్టేజి లో ఉన్నారు. చరణ్ కు అంత పెద్ద హిట్ ఇచ్చిన సుకుమార్ మహేష్ బాబు తో నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కథ విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదట. ఇప్పటికే మూడు కథలు వినిపిస్తే మహేష్ వాటిలో దేనికి కన్విన్స్ కాలేదని తెలిసింది.
 
దీనికి కారణాలు లేకపోలేదు. సుకుమార్ ముందు చిత్రాలకి బలం గా నిలిచిన అతని ముగ్గురు రైటర్లు దర్శకుడిగా మారి సొంత ప్రాజెక్టులు చేపట్టడం తో అతనికి చాలా ఇబ్బందిగా మారింది. మహేష్ “మహర్షి” తర్వాత తన తర్వాతి చిత్రం సుకుమార్ తోనే అని ఫిలిం వర్గాల్లో చర్చ ఇప్పటికే మొదలైపోయాయి. అయితే మహేష్ సందీప్ రెడ్డి వంగా తో కూడా ఒక కథ విషయమై చర్చించినట్లు సమాచారం. కానీ అదంతా ఉత్తుత్తి మాటలు అని మహేష్ సుకుమార్ ని ఫిబ్రవరి కల్లా తనకి నచ్చే కథని సిద్ధం చేయమని చెప్పినట్లు భోగట్టా.
 
నిజాం పాలన నాటి రజాకార్ల బ్యాక్డ్రాప్లో ఒక లైన్ వినిపిస్తే పిరియాడిక్ కథలతో రిస్క్ వద్దని మహేష్ సుకుమార్ కి చెప్పారట. దీంతో కొత్త టీమ్ ని సెట్ చేసుకునే వరకు సుకుమారి ఎలాగో తంటాలుపడి మహేష్ కి నచ్చే కథను సిద్ధం చేసుకోవడం లో ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. ఇంతకుముందు వీరిద్దరి కలయికలో వచ్చిన “1”సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమవ్వడంతో మహేష్ బాబు ఈసారి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ లెక్కల మాస్టారు ఒక వినూతనమైన కథతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల లెక్కలు మారుస్తాడో లేదో..!


Forum Topics


Top