పవన్ విషయంలో అదంతా అబద్ధం – మైత్రి మూవీ మేకర్స్!!!

By Xappie Desk, October 31, 2018 14:21 IST

పవన్ విషయంలో అదంతా అబద్ధం – మైత్రి మూవీ మేకర్స్!!!

సాధారణంగా దర్శకులు, హీరోలు ఒక సినిమాకి కమిట్ అయి అడ్వాన్స్ తీసుకుంటే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా వారు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తారు. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మైత్రి మూవీ మేకర్స్ పై తన సంతకం చేసిన చిత్రానికి తీసుకున్న అడ్వాన్స్ మొత్తం తిరిగి ఇవ్వబోతున్నారు అని ప్రచారం జరిగింది. సినిమాలు వదిలి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగిన పవన్ కళ్యాణ్, రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.
 
ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ జోరు అందరికీ తెలిసిందే. దాదాపు పది సినిమాల లిస్టు లో ఉన్నాయని నిర్మాతలు చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా వీరితో ఒక సినిమాని చేయాల్సి ఉంది. యువ దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ హీరోగా చేసేందుకు ఒక కథ కూడా సిద్ధంగా ఉందట. అయితే పవన్ రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం తో ఈ చిత్రానికి ఆయన స్థానంలో రవితేజ ని తీసుకున్నట్లు సమాచారం. దీంతో పవన్ తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొన్ని రోజులుగా మీడియాలో వినిపిస్తున్న విషయం.
 
కానీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ విషయాన్ని ఖండించారు. ఈ సంస్థ నిర్మాతలైన నవీన్ యెర్నేని, యలమంచి రవి శంకర్, చెరుకూరి మోహన్ తమ పవన్ కళ్యాణ్ పై డబ్బులు తిరిగి ఇవ్వాలని తీసుకువస్తున్న ఒత్తిడికి సంబంధించిన పుకార్లు అబద్ధం అని తేల్చి చెప్పారు. అలాగే తాము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నామని వాళ్లు వెల్లడించారు. అలాగే త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమాని ఒప్పుకున్నట్లు దానికి హీరో ఎవరనేది ఆయన డిసైడ్ చేస్తారని సమాచారం ఇచ్చారు.


Forum Topics


Top