యూట్యూబ్ లో సరికొత్త రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్..!

By Xappie Desk, November 06, 2018 13:59 IST

యూట్యూబ్ లో సరికొత్త రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్..!

ఫుల్ టైం రాజకీయాలలో అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను స్థాపించిన జనసేన పార్టీని మూడో అతిపెద్ద పార్టీగా అధికార ప్రతిపక్ష పార్టీలకు దీటుగా అతి తక్కువ సమయంలోనే సామాన్య ప్రజలకు చేరువై అన్ని విధాల వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గతంలో సినిమా రంగంలో ఉన్నప్పుడు అనేక సినిమా రికార్డులు సృష్టించిన విషయం మనకందరికీ తెలిసినదే. ఈ క్రమంలో రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ తన చివరి సినిమా 'అజ్ఞాతవాసి' దారుణంగా ప్లాప్ అయ్యింది.
 
పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రాకముందు తన మిత్రుడు మాటల మాంత్రికుడు సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా పై పవన్ కళ్యాణ్ అభిమానులు భీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు..అయితే సినిమా మెగాభిమానులను అంతగా అలరించలేదు..దీంతో బాక్సాఫీస్ బొక్క బోర్లా పడింది. అయితే ఈ మధ్యనే ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి ఎవడు 3 పేరిట యూట్యూబ్ లో వదిలారు అంతే బాక్సాఫీస్ దగ్గర విఫలం అయ్యిన ఈ సినిమా యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది.
 
ఇప్పటికే మొదటి రోజు వ్యూస్ నుంచి అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ సాధించిన దక్షిణ భారతదేశ చిత్రంగా మరో రికార్డును నమోదు చేసుకుంది.కేవలం 11 రోజుల్లోనే ఈ రికార్డు సాధించి చరిత్ర సృష్టించింది.ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తున్నారు.


Forum Topics


Top