రాజమౌళి కొత్త సినిమాలో హీరోయిన్ ల పేర్లు లీక్ !

By Xappie Desk, November 06, 2018 15:39 IST

రాజమౌళి కొత్త సినిమాలో హీరోయిన్ ల పేర్లు లీక్ !

బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత రాజమౌళి తీస్తున్న ఎన్టీఆర్- రామ్ చరణ్ మల్టీస్టారర్ సినిమా పై దేశంలోనే ఇప్పటికే అనేక అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా కథ గురించి అనేక వార్తలు బయటకు వచ్చాయి..ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ల గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.  ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ గా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన ఈ క్రమంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లా హీరోయిన్ల కోసం ఇప్పటికే అనేక పేర్లు వినపడినా ఎవరో కన్ఫామ్ చేయలేదు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాహుబలి హీరో ప్రభాస్ రాబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్న...ఈ నేపథ్యంలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం రోజున  ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ సినిమా యూనిట్ ముగ్గురు హీరోయిన్ల పేర్లు కూడా వెల్లడిస్తారన్న ఊహాగానాలతో పాటే.. ఆ ముగ్గురూ వీరేననే లీక్డ్ న్యూస్ కూడా వచ్చేసింది. అంతే కాదు అందులో ఇద్దరు బాలీవుడ్ భామలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకోనె లు కాగా..మరో పాత్ర కోసం హాలీవుడ్ గ్లామర్ స్టార్ ని సెలక్ట్ చేశారని చెబుతున్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నా..వాస్తవం ఏంటో ఈ నెల 11 వరకు ఎదురు చూడాల్సిందే.


Forum Topics


Top