ఛాలెంజ్ చేసి మరీ సర్కార్ సినిమా పైరసీ చేశారు…!

By Xappie Desk, November 08, 2018 14:13 IST

ఛాలెంజ్ చేసి మరీ సర్కార్ సినిమా పైరసీ చేశారు…!

ఈమధ్య సినీ ఇండస్ట్రీ ని విపరీతంగా భయపెడుతున్న పెనుభూతం “పైరసీ.” ఈ పైరసీ కి పాల్పడుతున్న సైట్ ల పైన ఎటువంటి చర్యలు తీసుకున్నా అవి ఏమీ వారిని ప్రభావితం చేయలేకపోయాయి. తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించిన తమిళ్ రాకర్స్ అనే పైరేట్ సైటే చాలా విస్తృతంగా సినిమాలను పైరసీ చేస్తున్నట్లు అంటుంటారు. తాజాగా మురుగుదాస్ దర్శకత్వం వహించిన సర్కార్ సినిమా యొక్క హెచ్ డి ప్రింట్ ని తాము మధ్యాహ్నంకల్లా విడుదల చేస్తామని ఆ సైట్ ప్రకటించింది.
 
దీనితో సర్కార్ సినిమా రిలీజ్ అయిన థియేటర్లలోకి సెల్ఫోన్, కెమెరాలు ఏమి తీసుకు వెళ్ళకుండా చర్యలు తీసుకున్నప్పటికీ అవేమీ సినిమా పైరసీ కాకుండా ఆపలేకపోయాయి. సినిమా రిలీజ్ అయిన మధ్యాహ్నం కు ఆ చిత్రానికి సంబంధించిన హెచ్ డీ ప్రింట్ ను విడుదల చేశారు. విశాల్ నిర్మాతల మండలి అధ్యక్షుడు అయిన తర్వాత భారీ ఎత్తున చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. ఏ ఒక్కటి కూడా ఫలితం చూపించలేక పోయాయి. తమిళ్ రాకర్స్ చెప్పినట్లుగానే చేసి తమ పరిధిని చాటుకున్నారు. తమిళ్తమిళ్ రాకర్స్ చేసిన ఈ చర్యతో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు చిత్ర వసూళ్లకు భారీగా గండి పడుతుందని ఆందోళన చెందుతున్నారు. నిర్మాతలు పైరసీ కాకుండా ఆపడం అసాధ్యం అని తేలిపోయింది. మరి కొందరు మాత్రం సినిమా బాగుంటే తప్పకుండా థియేటర్లలో చూస్తారు పైరసీ గురించి ఆందోళన చెందాల్సిన పనే లేదు అంటున్నారు.


Forum Topics


Top