షెడ్డు కి చేరుకోబోతున్న హీరోలు..!

By Xappie Desk, November 08, 2018 17:50 IST

షెడ్డు కి చేరుకోబోతున్న హీరోలు..!

సక్సెస్ ఉన్నప్పుడు పలకరించే చిరునవ్వే ఫెయిల్యూర్ వచ్చాక వెక్కిరిస్తుంది. మన టాలీవుడ్ లో కొంతమంది హీరోల పరిస్థితి చూస్తే ఇది కరెక్ట్ గా సూట్ అవుతుంది. అందరూ ఒకప్పుడు మంచి హిట్లు అనే సంపాదించిన రానురానూ పరిశ్రమలో కనుమరుగయిపోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. వారిలో కుమారి 21ఎఫ్ లాంటి యూత్ ఫుల్ హిట్ తర్వాత కెరీర్లో ఆ రేంజ్ లో చెప్పుకోదగ్గ హిట్ లేని యువ హీరో రాజ్ తరుణ్. కాస్తో కూస్తో ఆడిన చిత్రం అంటే ఈడోరకం ఆడోరకం మాత్రమే. తరువాత వచ్చిన సినిమాలు అన్నీ వరుస పరాజయాలే. మొన్న లవర్ దెబ్బకు ఆఫర్లు తగ్గిపోవడమే కాకుండా వచ్చిన సినిమా అతనినీ ముంచుతుందో లేక తెల్చుతుందో అన్న సందిగ్ధంలో పడిపోయాడు ఈ కుర్ర హీరో.
 
ఇక నందమూరి బ్రాండ్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రాం సెకండ్ ఇన్నింగ్స్ లో పటాస్ తో పర్వాలేదనిపించినా ఆ తర్వాత వరస డిజాస్టర్ లతో తన ఉనికినే ప్రశ్నార్థకం గా మార్చుకున్నాడు. అభిమానుల అండ ఉంది కదా అని ఇప్పటికీ పెద్ద బ్యానర్లే అటు వైపు మొగ్గు చూపుతున్న అతను మాత్రం డేంజర్ జోన్ లోనే ఇప్పటికీ ఉన్నాడు. మరోవైపు అక్కినేని వారసుడు నాగ చైతన్య పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. సవ్యసాచి కూడా ఫట్ మనడంతో నాగచైతన్య కి హ్యాట్రిక్ పూర్తయింది. రారండోయ్ వేడుక చూద్దాం లాంటి ఓ మాదిరి హిట్ చూసి చైతూ చాలా రోజులైంది. ఇండస్ట్రీలోకి వచ్చి 9 ఏళ్ల అవుతున్నా ఇప్పటి వరకు అతను 30 కోట్ల మార్కుని చేరుకోలేకపోయాడు. నిన్న మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ ఈ ఫీట్ మూడు సార్లు సాధించాడు. దీంతో ఇతని మీద ఒత్తిడి చాలానే ఉందని చెప్పాలి.
 
ఇక సీనియర్ నటుడు గోపీచంద్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. మొన్న ఈ మధ్య వచ్చిన గౌతమనంద పర్వాలేదనిపించినా అతని మార్కెట్ ని ఏమాత్రం పెంచలేకపోయింది. అభిమానులు అతని దగ్గర నుండి మంచి సినిమాలు ఆశిస్తున్నా నాసిరకం మాస్ కథలతో ఎప్పటికప్పుడు నిరాశ పరుస్తూనే ఉన్నాడు. ఇక రామ్ సిచువేషన్ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. వెతికి మరి హిట్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నా అతని మార్కెట్ లో ఏ మాత్రం మార్పు రాలేదు. నితిన్ కూడా ఎప్పుడు హిట్ కొడతాడో తెలీక అందరూ తెగ ఆలోచిస్తున్నారు.
 
అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కి వచ్చేశాడు. తనకంటూ హాస్య చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న నరేష్ ఆ పేరుని పోగొట్టుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. ఇక మన మంచు హీరోలు విష్ణు, మనోజ్ గురించి ప్రస్తావన తేకపోవడం మంచిది. కళ్యాణ్ రామ్ కూడా హీరో కన్నా నిర్మాణ వర్గం పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ సినిమాల విషయంలో తప్పులని విశ్లేషించుకుంటే మళ్లీ గాడిలో పడే అవకాశం లేకపోలేదు. లేదంటే మాత్రం ఒకప్పుడు ఫలానా హీరో ఉండేవాడు అని తెలుసుకోవడానికి తప్ప ఇంకేం మిగలదు.


Forum Topics


Top