గర్ల్ ఫ్రెండ్ తో అర్ధరాత్రి పోలీస్ లని చితక్కోట్టిన నటుడు ఉదయ కిరణ్

By Xappie Desk, November 11, 2018 14:07 IST

గర్ల్ ఫ్రెండ్ తో అర్ధరాత్రి పోలీస్ లని చితక్కోట్టిన నటుడు ఉదయ కిరణ్

మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఒక కుర్ర నటుడు పోలీసుల ని హైరానా పెట్టేసాడు .. ఉదయ కిరణ్ అనేటువంటి ఒక యువ నటుడు మద్యం మత్తు లో పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి కంప్యూటర్ రికార్డుల దగ్గర నుంచి అన్నీ నాశనం చేయడమే కాకుండా పోలీసుల మీద కూడా దాడి చేసాడు. ఉదయ కిరణ్ తో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ ఈ ఉదంతం లో ఉండడం విశేషం. దాంతో ఒళ్ళు మండిన పోలీసులు ఉదయ్ కిరణ్ పై పీడీ చట్టం ప్రయోగించామరు.బంజరాహిల్స్ లో నివాసం ఉండే యువనటుడు ఉదయ్ కిరణ్ శుక్రవారం రాత్రి తన ఢిల్లీకి చెందిన స్నేహితురాలు అనుగుప్తాతో కలిసి ఓ పబ్ లో శుక్రవారం రాత్రి మద్యం తాగారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో కారులో ఇద్దరూ మాదాపూర్ వైపు వస్తున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో నిఖిల్ అనే వ్యక్తి చెందిన కారును ఢీకొట్టారు. అనంతరం నిఖిల్-ఉదయ్ కిరణ్ గొడవపడి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ నిఖిల్ కీ ఉదయ కీ గొడవ జరిగింది .దీన్ని హెడ్ కానిస్టేబుల్ ఆపబోయాడు దాంతో కానిస్టేబుల్ మీద కూడా ఉదయ్ దాడి చేసాడు. అను గుప్తా కూడా స్టేషన్ లో పోలీసులని తిడుతూ కంప్యూటర్ లు నాశనం చేసింది. ఉదయ్ కిరణ్ కు 137 - అనుగుప్తాకు 122 మిల్లీగ్రాముల అల్కహాల్ శాతం ఉందని ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు. ఉదయ్ కిరణ్ హైదరాబాద్ లో ఉంటూ పరారే యువరాజ్యం - ఫేస్ బుక్ - రాక్షసులు సినిమాల్లో నటించాడు.


Tags :

Uday Kiran


Top