హీరో రవితేజ పై దారుణమైన కామెంట్లు చేసిన ఇలియానా..!

By Xappie Desk, November 13, 2018 11:33 IST

హీరో రవితేజ పై దారుణమైన కామెంట్లు చేసిన ఇలియానా..!

శ్రీనువైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల జరిగిన విషయం అందరికీ తెలిసినదే. ఈ వేడుకలో హీరో రవితేజ కంటే ఎక్కువగా హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియానా ప్రేక్షకులను ఆకర్షించింది. ముఖ్యంగా ఇలియానా.. రవితేజ పై ఈ వేడుకలో చేసిన కామెంట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు రవితేజ అభిమానుల్లో ఆందోళనకు గురి చేసినట్లు తెగ వార్తలు వినబడుతున్నాయి. ఈ సినిమాలో ఇంత వయసులో కూడా అందంగా ప్రేక్షకులను అలరించడం కోసం రవి తేజ గారు సిక్స్ ప్యాక్ చేశారంటూ..రవితేజ ని కొంత వయస్సు పైబడిన వ్యక్తిగా ఇలియానా కామెంట్లు చేయడంతో అటు ఇండస్ట్రీలోనూ ఇటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మొన్నటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ కోసం తెగ కష్టపడి సినిమాలు ఫ్లాప్ చేసుకుని తిరిగి తనకి లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీ లో తన తోటి హీరో అయినా రవితేజ పై ఇలా కామెంట్లు చేయడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఇలియానాపై. మొత్తం మీద ఇలియానా.. రవితేజ పై చేసిన కామెంట్లు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.


Forum Topics


Top