కాఫీ తాగే లోపు కరణ్ కనిపెట్టిన గుట్టు !

కాఫీ తాగే లోపు కరణ్ కనిపెట్టిన గుట్టు !

ఎంత పెద్ద బాలీవుడ్ సెలబ్రిటీలు అయినా ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తో కాఫీ తాగాలంటే కొంచెం ఆలోచిస్తారు. అందుకే ఉత్తరాన "కాఫీ విత్ కరణ్" అనే షో అంత పాపులర్ అయింది. ఈ టాక్ షో కి బాలీవుడ్ సెలబ్రిటీలని పిలిచి ఒక మంచి కాఫీ ఇచ్చి అందులో తీయని మాటలు కలిపి చివరకు వారితో నిజాలను కక్కిస్తారు కరణ్. ఏదో ఒక విధంగా సెలబ్రెటీల నుండి రహస్యాలు లాగేస్తాడు. ఇప్పటికే ఎంతో మంది ప్రేమ వ్యవహరాలను - వ్యక్తిగత విషయాలను వారితోనే బయటకు చెప్పించిన కరణ్ తాజాగా మలైకా అరోరా త్వరలో అర్జున్ కపూర్ ను వివాహం చేసుకోబోతున్నట్లుగా లీక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా వరుణ్ ధావన్ ప్రేమ గుట్టును రట్టు చేశాడు.
 
చాలా రోజుల నుండి నటుడు వరుణ్ ధావన్ – నటాషా దలాల్ ప్రేమలో ఉన్నట్లు మీడియా వర్గాలు హోరెత్తించాయి. కానీ వరుణ్ మాత్రం దీనిపై పెద్దగా స్పందించలేదు. పైగా తన వ్యక్తిగత విషయాలను అందరి ముందు చెప్పాల్సిన అవసరం తనకు లేదని అప్పట్లో కొంచం గట్టిగానే బదులిచ్చాడు. ప్రేమ-పెళ్లి పూర్తిగా తన వ్యక్తిగతమని చెప్పిన ఆయన చివరికి కరణ్ జోహార్ షోలో తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టేసాడు.
 
తాను నటాషా తో ప్రేమలో ఉన్నట్లు, అయితే ఆమెకు ఇలా మీడియా హంగామా అంటే నచ్చక పోవడం వల్ల ఈ విషయాన్ని ఇప్పటివరకు బయట పెట్టలేదని చెప్పుకొచ్చారు. దలాల్ పూర్తిగా స్వేచ్ఛ కోరుకునే వ్యక్తి కావడం వల్ల తనకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కానీ ఇన్ని రోజులు మౌనంగా ఉన్నట్లు చెప్పాడు. అయితే ఈ విషయాన్ని బయట పెట్టాల్సిన సమయం వచ్చిందని భావించి ఇప్పుడు ఓపెన్ అవుతున్నాను అని అన్నాడు. నటాషా చాలా సింపుల్ గా ఉండే అమ్మాయి అని తనలో ఉండే ఆ క్వాలిటీ తనకు చాలా బాగా నచ్చి ప్రేమించానని ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇలా ఉంటది మరి మన కరణ్ కూపీ లాగే కాపీ షో...!


Tags :

Karan Johar


Top