ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ వన్ లో పెద్ద ఎన్టీఆర్ గొంతు..!

By Xappie Desk, November 14, 2018 10:34 IST

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ వన్ లో పెద్ద ఎన్టీఆర్ గొంతు..!

నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర లో ఎన్టీఆర్ బయోపిక్ గా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. తన కెరియర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును బాలయ్య తీసుకోవడంతో ఈ సినిమా పై టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలోనూ ఆసక్తి నెలకొంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ఒకటి ఎన్టీ రామారావు గారి రాజకీయ జీవితానికి సంబంధించి మరొకటి సినీ రంగానికి సంబంధించిన భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో 'ఎన్టీఆర్ కథానాయకుడు' అంటూ సినిమా రంగానికి సంబంధించిన భాగానికి టైటిల్ పెట్టారు చిత్రయూనిట్. ఈ క్రమంలో ఈ సినిమాలో ఆనాడు ఎన్టీఆర్ నటించిన పాత సన్నివేశాల గొంతుని ప్రస్తుత సినిమాలో ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఉదాహరణకు దానవీర శూరా కర్ణ లోని "ఏమంటివి ఏమంటివి", బొబ్బిలి పులి లోని కోర్టు సీన్లో డైలాగులు అన్నమాట. అలంటి సంభాషనలని బాలయ్య గొంతులో కంటే అన్న గారి గొంతులో వినిపిస్తేనే  సినిమాకు కొంత ప్లస్ అవుతుందని క్రిష్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది..ఏది ఏమైనా వచ్చే సంక్రాంతికి ఎన్టీఆర్ మొదటి భాగం కథానాయకుడు విడుదల చేయాలని భావిస్తున్నారు సినిమా యూనిట్.


Forum Topics


Top