ఆన్‌లైన్‌లో టాక్సీ వాలా సినిమా..ఆందోళనలో సినిమా యూనిట్..?

By Xappie Desk, November 14, 2018 12:32 IST

ఆన్‌లైన్‌లో టాక్సీ వాలా సినిమా..ఆందోళనలో సినిమా యూనిట్..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలు ఉన్న హీరోలలో ముందున్నవాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ హీరో స్టేటస్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ వరుసపెట్టి సినిమాలు ఒప్పుకొని విడుదల చేస్తూ బాక్సాఫీస్ దగ్గర తన దమ్ము చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల విజయ్ నటించిన కొన్ని సినిమాలు ప్లాప్ అయినా నేపద్యంలో తను తాజాగా నటించిన టాక్సీవాలా సినిమా పై అనేక అంచనాలు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. రాహుల్ సంక్రుత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన టాక్సీవాలా ఈ నేల 17న విడుదల కానుంది. అయితే విడుదల కాకముందే ఈ సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో పైరసీలో బయటకు రావడంతో టాక్సీ వాలా సినిమా యూనిట్ ఒక్క సారిగా షాక్ కు గురయింది. ఇదే క్రమంలో మరో పక్క ఆన్‌లైన్‌లో సినిమా చూసిన వారు టాక్సీవాలా చెత్త సినిమా అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో హీరో విజయ్ దేవరకొండ మీడియా ముందుకు వచ్చి పైర‌సీని ఏ ఒక్క‌రూ ప్రోత్స‌హించొద్ద‌ని, ద‌య‌చేసి ఈ సినిమాను థియేట‌ర్‌లోనే చూడాలని విజయ్ విజ్ఞ‌ప్తి చేశారు. అయితే ఒక‌వైపు మొత్తం సినిమా ఆన్‌లైన్‌లో రావ‌డం, మ‌రోవైపు ప్లాప్ టాక్ ప్ర‌చారం అవ‌డంతో ఈ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో అని సిని వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.


Forum Topics


Top