రీమేక్ లు చేయనంటున్న రవితేజ...!

By Xappie Desk, November 14, 2018 17:35 IST

రీమేక్ లు చేయనంటున్న రవితేజ...!

ఈ మధ్యకాలంలో "రాజాదిగ్రేట్" తప్ప పెద్దగా హిట్టు కొట్టిన రవితేజ సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల లిస్ట్ లో ఉండాల్సిన వాడు సడన్ గా ఇప్పుడు థియేటర్ల దగ్గర టైర్ 2 హీరోలతో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయాల్లో చాలా మంది హీరోలు వేరే భాషలో హిట్టయినా సినిమాలను రీమేక్ చేసి పునర్జీవం పొందారు. అయితే రవితేజ మాత్రం తాను అటువంటి సినిమాలు చేసే ప్రసక్తే లేదు అన్నట్లు ఉంటున్నారు.
 
తమిళంలో విజయ నటించి సూపర్ హిట్ అయిన "తేరీ" సినిమాను గతంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దానికి స్క్రిప్ట్ రెడీ చేసుకున్న సంతోష్ శ్రీనివాస్ కు ఎలాంటి బదులివ్వకుండా పవన్ రాజకీయాల్లోకి వెళ్లి నిరాశ పరిచారు. అయితే అదే కథను రవితేజతో చేస్తున్నట్లు వినికిడిలో ఉంది. మాస్ మహారాజా కూడా ముందు ఆ చిత్రానికి పచ్చజెండా ఊపేశారట. తాజాగా "అమర్ అక్బర్ ఆంటోనీ" చిత్రం ప్రమోషన్స్ కోసం వచ్చిన రవితేజ ను తేదీ చిత్రం రీమేక్ గురించి అడగగా ఆ సినిమా తన చేయట్లేదని తేల్చిచెప్పేశాడు.
 
ఇప్పుడు కేవలం వీ ఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా నే చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంకా తమిళంలో హిట్టయిన 'బోగన్'ను తెలుగులో చేయడానికి అంగీకారం తెలిపిన రవితేజ.. ఆ తర్వాత మనసు మార్చుకున్నాడు. ఈ విషయమై దాని దర్శకుడు లక్ష్మణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు కూడా. ఇంక రెండో సారి కూడా సినిమా ఆగిపోయిన సంతోష్ శ్రీనివాస్ పరిస్థితి ఐతే చెప్పనవసరం లేదు. ఇలా రవితేజ తనకు సాంబార్ వాసన పడదు అన్నట్లు తమిళ సినిమాల రీమేక్ లను తిరస్కరిస్తూ వస్తున్నారు. త్వరలో అయినా తన నిర్ణయం మార్చుకుంటాడేమో చూడాలి.


Forum Topics


Top