పోస్టర్ చూసి షాక్ అయిన సిమ్రాన్..!

By Xappie Desk, November 15, 2018 11:11 IST

పోస్టర్ చూసి షాక్ అయిన సిమ్రాన్..!

‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘పేట్ట’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరో రజినీకాంత్ తో పాటు హీరోయిన్లుగా త్రిష మరియు సిమ్రాన్ నటిస్తున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా లో రజినీకాంత్ కాలేజ్ వార్డెన్ గా మరియు ప్లాష్ బ్యాక్ లో సైనికాధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా పోస్టర్ ఒకటి ఇటీవల సినిమా యూనిట్ విడుదల చేసింది. ఆ పోస్టర్ లో సిమ్రాన్ మరియు రజినీకాంత్ పూల బోకే పట్టుకుని పరిగెత్తే సన్నివేశం. దీంతో పోస్టర్ చూసిన హీరోయిన్ సిమ్రాన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టిస్తుంది. ‘నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఓమై గాడ్.. ఇది (రజనీతో కలిసి నటించడం) నిజంగా జరిగిందంటే నమ్మలేకపోతున్నా’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ పోస్టర్‌కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది. రజనీ తాజా చిత్రం ‘2.ఓ’ నవంబరు 29న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతోంది. మరియు అదే విధంగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కూడా రజనీకాంత్ ఓ సినిమా చేయనున్న ట్లు ప్రచారంలో ఉంది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Forum Topics


Top