టీజర్ టాక్ : ఆరంభానికి ముందే అదరగొట్టిన

By Xappie Desk, November 17, 2018 12:24 IST

టీజర్ టాక్ : ఆరంభానికి ముందే అదరగొట్టిన

సినిమా షూటింగ్ మొదలు కాకముందే "కాన్సెప్ట్ టీజర్" అనే సంప్రదాయానికి నాంది పలికింది ఒక నిర్మాణ సంస్థ. అది ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుందని వాళ్ళే ఊహించి ఉండరు. "ఇక్కడికి పోతావు చిన్నవాడా" ఫేమ్ నందిత శ్వేత నటించబోతున్న చిత్రం "అక్షర" ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ విడుదల చేసిన కాన్సెప్ట్ టీజర్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. నిజంగా చెప్పాలంటే అద్దిరిపోయిందని నెటిజన్ల టాక్.
 
విద్యావ్యవస్థ, స్టూడెంట్స్ ఆత్మహత్యల పైన రాబోతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ లో లెక్చరర్ గా పుస్తకంలో రక్తం అంటిన కత్తిని పెట్టుకుని కాలేజీ రూమ్ కు రావడం... దానిని చిత్రీకరించిన విధానం బాగుంది. ముఖ్యంగా టీజర్ టెంపోను కొనసాగించడంలో బ్యాక్ గ్రౌండ్ అందించిన సురేష్ బొబ్బిలి కీలకపాత్ర వహించాడు. శ్వేత నందిత కనపడే చివరి షాట్ అయితే అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు బి. చిన్న కృష్ణ. ఈ సినిమాను సురేష్ వర్మ అల్లూరి, ఆహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. మెగా హీరోలకు అభిమానిగా ఆహితేజ బెల్లంకొండ సోషల్ మీడియా జనులకు సుపరిచితమే. శుక్రవారం ఉదయం 10.09 గంటలకు ముహూర్తం పెట్టుకున్న ఈ చిత్రానికి కాన్సెప్ట్ టీజర్ మాత్రం మంచి బూస్ట్ అప్ అనే చెప్పాలి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top