మళ్ళీ ప్రయోగం చేస్తోన్న నాగ చైతన్య .. ఫాన్స్ గోల గోల !

By Xappie Desk, November 17, 2018 12:32 IST

మళ్ళీ ప్రయోగం చేస్తోన్న నాగ చైతన్య .. ఫాన్స్ గోల గోల !

గత కొంత కాలం నుండి బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాగచైతన్య ఇటీవల అనేక ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. నాగచైతన్య చివరి మూడు చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో ప్రస్తుతం చైతు కెరీర్ చీకటిలో పడిపోయింది. ఈ నేఫధ్యంలో నాగచైతన్య తన భార్య అయిన సమంతా తో కలిసి 'మజిలి' సినిమా చేస్తున్నారు. అయితే ఈమద్య కాలంలో వరుసగా వస్తున్న పీరియాడిక్ కథాంశంల  మాదిరిగానే మజిలి చిత్రంలో కూడా కొన్ని పీరియాడిక్ సీన్స్ ఉంటాయట. 1990 నేపథ్యంలోని కొన్ని సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే కొన్ని పీరియాడిక్ సీన్స్ కొన్ని రెగ్యులర్ సీన్స్ అంటే ప్రేక్షకులు ఆధరించడం కష్టమే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో ఒక రీమిక్స్ పాట ఉంటుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే వరుస ప్లాపులతో ఉన్న నాగచైతన్య  ఇటువంటి సమయంలో ప్రయోగాలు చేయటం అక్కేనేని అభినులకు నచ్చటం లేదని టాక్. మరోపక్క కుర్ర హీరోలు వరుస సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూ ఉన్న ఈ తరుణంలో ప్రయోగాలు ఎందుకు అంటూ మండిపడుతున్నారు అభిమానులు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Forum Topics


Top