అల్లరి నరేష్ కు ఆఖరి ఛాన్స్ !

By Xappie Desk, November 17, 2018 15:51 IST

అల్లరి నరేష్ కు ఆఖరి ఛాన్స్ !

ప్రముఖ కమెడియన్ అల్లరి నరేష్ ప్రస్తుతం కెరీర్ లో ఏ స్టేజ్లో ఉన్నారు అందరికీ తెలిసిందే అసలు హిట్లు లేక అతని మార్కెట్ పూర్తిగా దెబ్బతింది అయితే అతని చివరి హిట్ ఆరేళ్ల క్రితం వచ్చిన సుడిగాడు. ఆ సినిమా తరువాత దాదాపు డజను సినిమాలు చేసినా కూడా ఏ ఒక్కటీ బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టెక్కలేదు. నిజం చెప్పాలంటే అన్ని చాలా పేలవంగా ఆడాయి.. దీంతో అతను తాజాగా చిత్రంలో ఒక క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే అతను చేస్తుంది సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న మహర్షి చిత్రంలో.
 
ఇంక తను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నే కొనసాగుతారని అనుకుంటే మీరు పొరబడినట్లే. అంతకు ముందు కూడా వేరే చిత్రాల్లో ఇతర హీరోలతో నరేష్ స్క్రీన్ షేర్ చేసుకున్నా సహచర హీరోగానే నటిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడే నరేష్ జీ. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఒక చిత్రం చేయబోతున్నాడు అంతకుముందు సీమటపాకాయ్, సీమ శాస్త్రి లాంటి మంచి హిట్లు ఇచ్చిన ఈ దర్శకుడు పైన అల్లరి నరేష్ చాలా ఆశలే పెట్టుకున్నాడు ఈ చిత్రంతో తనకు మంచి బ్రేక్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు మరోవైపు నాగేశ్వర్ రెడ్డి పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. . 'ఈడో రకం ఆడో రకం'.. 'ఆటాడుకుందాం రా'.. 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'..'ఆచారి అమెరికా యాత్ర' ఇది అయన సినిమాల వరస. నరేష్-జి.నాగేశ్వరరెడ్డి కాంబో ఇద్దరికీ సక్సెస్ తీసుకొస్తుందేమో వేచి చూడాలి
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Forum Topics


Top