చిరంజీవిని ప్రెజర్ చేస్తోన్న చరణ్ !

By Xappie Desk, November 17, 2018 19:35 IST

చిరంజీవిని ప్రెజర్ చేస్తోన్న చరణ్ !

తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని శక్తిగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలోకి వెళ్ళిన తర్వాత ఇకపై సినిమాలు చేయడని అనుకున్నారంతా. అయితే అతను రీ ఎంట్రీ తో ఖైదీ150 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో నాన్ బాహుబలి రికార్డును బద్దలుకొట్టాడు. ఇక నుండి తాను వరుసగా సినిమాలు చేస్తానంటూ అభిమానులకు హామీ ఇచ్చేశారు. అయితే ఖైదీ నెం.150 చిత్రం విడుదలై చాలా కాలం అయినా కూడా ఇంకా మరో సినిమాను తీసుకు రాలేక పోయాడు. కారణం భారీ బడ్జెట్ చిత్రం సైరాను మొదలు పెట్టడమే అనే విషయం తెల్సిందే. సైరా వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల కానుంది.
 
అయితే ఈలోపల చిరు రీ ఎంట్రీ ఇచ్చాక వరుసగా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన చరణ్ మాత్రం చిరుని ఒకేసారి రెండు సినిమాలు చేయమని ప్రెజర్ చేస్తున్నాడట. సైరా విడుదల కాకుండానే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాను తన తండ్రి చిరంజీవితో సినిమాను మొదలు పెట్టాలని చరణ్ భావిస్తున్నాడు. అందుకోసం కొరటాలను హడావుడి చేస్తున్నాడు. అలాగే కొరటాల సినిమా ఇంకా పట్టాలు ఎక్కకుండానే తాను చిత్రం తీస్తున్న బోయ ను కూడా ఒక కథ రెడీ చేయమని కోరినట్లు సమాచారం. ఇంకా పలువురు పెద్ద దర్శకులకు కూడా తన తండ్రి కోసం కథలు సిద్దం చేయాలని చరణ్ సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ చిరు మాత్రం ఒకదాని తరువాత ఒకటి నిదానంగా చేద్దామని భావిస్తున్నా చరణ్ కోరికను కాదనలేకపోతున్నాడు. చరణ్ కోరిక మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో చిరంజీవి తదుపరి చిత్రానికి అప్పుడే కమిట్ అయ్యాడట. చిరును ఒకే సారి రెండు చిత్రాలు చేయాల్సిందిగా సూచిస్తున్న చరణ్ తాను మాత్రం వన్ బై వన్ అన్నట్లుగా సినిమాలు చేస్తున్నాడు.
 


Forum Topics


Top