సైరా సిద్దమ్మ మీద మిక్స్ టాక్ !

By Xappie Desk, November 18, 2018 16:05 IST

సైరా సిద్దమ్మ మీద మిక్స్ టాక్ !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇటీవలే జార్జియాలో భారీ వార్ యాక్షన్ ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సైరా మేలో విడుదల చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ రోజు నయనతార పుట్టినరోజు సందర్భంగా తన లుక్ ని కానుకగా విడుదల చేసింది కొణిదెల సంస్థ.
 
ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి భార్యగా సిద్దమ్మ రూపంలో ఉన్న లుక్ ను రిలీజ్ చేసారు. ఇందులో క్లోజ్ అప్ షాట్ లో ఉన్న నయనతార ఫేస్ తప్ప ఇంకేమి రివీల్ చేయలేదు. నిజానికి చిరంజీవితో కలిసి ఉన్న లుక్ ని ఆశించారు అభిమానులు. ఇద్దరు జంటగా ఉన్న పిక్ వస్తుందనే ఊహకు భిన్నంగా నయనతార సింపుల్ స్టిల్ ని వదిలారు. ధగధగ మెరుస్తున్న ఆభరణాలతో నయన్ కనులనిండుగా ఉంది. అప్పుడెప్పుడో సెట్స్ లో లీక్ అయిన సీన్ల తాలుకు గెటప్ అని అర్థమవుతోంది.
 
సైరా షూటింగ్ కొంత అవాంతరాల మధ్య జరుగుతుండటం పట్ల చిరంజీవి అసహనంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ ఒకపక్క వినయ విధేయ రామ ఫినిషింగ్ తో పాటు రాజమౌళి మల్టీ స్టారర్ లో బిజీ అయిపోయి సైరా మీద పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. భారం మొత్తం పెద్దమ్మాయి సుస్మితతో పాటు చిరు మీదే పడటంతో కొంత ఇబ్బంది వచ్చినట్టు సమాచారం. 
ముందు నుంచి ఈ సంస్థ వ్యవహారాల్లో తలదూర్చని అల్లు అరవింద్ దీనికి సైతం దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. వచ్చే వేసవికి రిలీజ్ టార్గెట్ చేసినా ఆ లోపు పోస్ట్ ప్రొడక్షన్ తో సహా గ్రాఫిక్స వర్క్ మొత్తం ఎంతవరకు పూర్తవుతుందో అనుమానమే. ఏప్రిల్ లో మహర్షి, ఆగస్ట్ లో సాహో ఉంటాయి కాబట్టి సైరా ఖచ్చితంగా మే లేదా జూన్ లోనే రావాలి. యూనిట్ మాత్రం ఈ విషయంలో ధీమాగానే ఉంది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Forum Topics


Top