ఈ మధ్యన వచ్చిన అతి చెత్త సినిమాలు

By Xappie Desk, November 18, 2018 20:11 IST

ఈ మధ్యన వచ్చిన అతి చెత్త సినిమాలు

మొన్న వచ్చిన రవితేజ అమర్ అక్బర్ అంటోనీ చూసి బయటికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు అంటున్న మాట ఒకటే. కథలు లేకపోతే, ఆలోచించడం చేతకాకపోతే తీయడం మానేయండి తప్ప ఇలాంటి రోత పుట్టే సినిమాలను మా మీదకు వదలకండి అని. దూకుడు, డీ, రెడీ, దుబాయ్ శీను లాంటి అల్టిమేట్ ఎంటర్ టైనర్స్ ఇచ్చిన శీను వైట్ల తీసినదేనా అని అనుమానం వచ్చేలా చేసాడు. గతంలో చవి చూసిన మూడు పరాజయాల నుంచి శీను వైట్ల ఏమి నేర్చుకోలేదని అర్థమైపోయింది. ఇది ఈ ఒక్కడితో ఆగింది కాదు మొదలైంది కాదు.
 
నాగార్జున కెరీర్ లోనే ఘోరమైన ప్లాప్ గా రికార్డు సృష్టించిన ఆఫీసర్ తీసిన రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్. కనీసం కోటి రూపాయల షేర్ కూడా రాబట్టలేక అభిమానులు సైతం ఛీ అనేంత తీసికట్టుగా వచ్చింది ఆ సినిమా. వర్మ పేరు ఉంటే సినిమా కొనేందుకు కూడా జనం భయపడుతున్నారు. ఇక నాని కృష్ణార్జున యుద్ధం తీసిన మేర్లపాక గాంధీ మొదటి రెండు సినిమాలు సూపర్ హిట్స్. కానీ ఇది మాత్రం దారుణంగా దెబ్బ తింది.
 
నేషనల్ అవార్డు తెచ్చుకునే సినిమా తీసిన సతీష్ వేగ్నేశ శ్రీనివాస కళ్యాణం దిల్ రాజుకే కాదు ప్రేక్షకులకు సైతం పీడకలగా మారింది. ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన కరుణాకరన్ తీసిన తేజ్ ఐ లవ్ యు మూడో రోజుకే దుకాణం సర్దేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. టీవీలో వచ్చినా చూసేందుకు ఆసక్తి రానంత దారుణమైన సినిమాలు ఈ ఏడాది చాలానే వచ్చాయి. ఇకనైనా రచయితలు దర్శకులు స్క్రిప్ట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఓపెనింగ్స్ కూడా సున్నా అయిపోయే ప్రమాదం దగ్గరలోనే ఉంది.


Forum Topics


Top