రాజమౌళి పోస్ట్ చూసి పండుగ చేసుకుంటున్న ఎన్టీఆర్ మరియు చెర్రీ ఫాన్స్

రాజమౌళి పోస్ట్ చూసి పండుగ చేసుకుంటున్న ఎన్టీఆర్ మరియు చెర్రీ ఫాన్స్

తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోలైన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తో కలిసి ఇండియన్ ఫిలిం సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇప్పటికే ప్రారంభం అయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని రాజమౌళి తెలుగు తమిళం మరియు హిందీ భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇటీవల తెలుగు సినిమా రంగంలో ఉన్న పెద్దలు మరియు ప్రముఖ హీరోల మధ్య పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల మొదలైపోయింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ నేపధ్యంలో షూటింగ్ లో భాగంగా డైరెక్టర్ రాజమౌళి ఎన్టీఆర్ మరియు రాంచరణ్ లపై భారీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించినట్లు సమాచారం.
 
అంతేకాకుండా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. అందులో మొదటి హీరోయిన్‌గా కీర్తి సురేశ్ పేరు వినిపిస్తుండగా.. రెండో హీరోయిన్‌గా రష్మిక మందనను సంప్రదించినట్లు టాక్. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సోషల్ మీడియాలో డైరెక్టర్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మొదలైపోయింది అన్నా వార్త పెట్టగానే నందమూరి మరియు మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop