తెలుగులో 'అంజలి విక్రమాదిత్య' గా రానున్న నయనతార తమిళ సూపర్ హిట్ చిత్రం ' ఇమైక్కా నొడిగళ్'..!!

తెలుగులో 'అంజలి విక్రమాదిత్య' గా రానున్న నయనతార తమిళ సూపర్ హిట్ చిత్రం ' ఇమైక్కా నొడిగళ్'..!!

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ' ఇమైక్కా నొడిగళ్' తెలుగులో భాషలోకి అనువాదం అవుతుంది.. విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై సిహెచ్ రాంబాబు, ఆచంట గోపినాథ్ లు ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు.. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చి విజయవంతం అయిన ఈ చిత్రానికి తెలుగులో ' అంజలి విక్రమాదిత్య' టైటిల్ ని ఖరారు చేసారు.. ఆర్. అజయ్ గనన్ముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, అధర్వ, రాశిఖన్నా లు ప్రధానపాత్రలు పోస్తుండగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రతినాయకునిగా కనిపించనున్నారు.. ఈ సినిమాలో అంజలి పాత్రలో నయనతార కనిపించనుండగా, విక్రమాదిత్య పాత్రలో విజయ్ సేతుపతి అతిధిపాత్రలో మెరవనున్నారు.. తమిళంలో క్యామియో ఫిలిమ్స్ బ్యానర్ పతాకంపై సీజే జయకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించగా, హిప్ హాఫ్ తమిళ సంగీతం, RD రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ని అందించారు. డబ్బింగ్ కార్యక్రమాలు ఎంతో చురుకుగా సాగుతుండగా ఈ చిత్రాన్ని జనవరి లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..
 
తారాగణం: నయనతార, అధర్వ, రాశి ఖన్నా, అనురాగ్ కశ్యప్, రమేష్ తిలక్, దేవన్ మరియు ఇతరులు
 
సాంకేతిక నిపుణులు :
కథ, స్క్రీన్ ప్లే & డైరెక్షన్: ఆర్. అజయ్ గనన్ముత్తు
నిర్మాతలు: సిహెచ్ రాంబాబు, ఆచంట గోపినాథ్
బ్యానర్: విశ్వశాంతి క్రియేషన్స్
సంగీతం:హిప్ హాఫ్ తమిళ
సినిమాటోగ్రఫీ: ఆర్.డి. రాజశేఖర్
ఎడిటర్: భువన్ శ్రీనివాసన్
PRO: వంశీ-శేఖర్
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top