ముద్దులే కాదు ఇంకా ఉన్నాయి! - హెబ్బా పటేల్

By Xappie Desk, November 19, 2018 23:22 IST

ముద్దులే కాదు ఇంకా ఉన్నాయి! - హెబ్బా పటేల్

ఈమధ్య టాలీవుడ్ లో ముద్దు సన్నివేశాలకు చాలా క్రేజ్ పెరిగిపోయింది. చిన్న సినిమాలు, మీడియం సినిమాలో అని తేడా లేకుండా ప్రతి సినిమాలో వీటికి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. కథలో పెద్దగా విషయం లేకున్నా చిత్రంలో ఇటువంటి సీన్లు పడితే ఓపెనింగ్స్ చాలా బాగా వస్తాయి అనేది వీరి ఆలోచన. ఈ మధ్యనే రిలీజ్ అయి పెద్ద హిట్లు సాధించిన అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 లాంటి చిత్రాలే వీరికి స్పూర్తి. అయితే ఇప్పుడు కుమారి 21ఎఫ్ ఫేమ్ హెబ్బా పటేల్ నటిస్తున్న చిత్రం పేరే ఈ ముద్దులతో ముడిపడి ఉంది.
 
24 కిస్సెస్ ఈమె నటించిన చిత్రం ఈ చిత్రానికి దర్శకుడు అయోధ్య కుమార్ ఇంతకుముందు మిణుగురు పురుగులు అనే సినిమా తీసి పలువురి ప్రశంసలు దక్కించుకున్న అతను ఇప్పుడు ఇటువంటి జోనర్లో వెళ్లడం పలు విమర్శలకు దారితీస్తోంది. అయితే మాత్రం ఈ చిత్రంలో కేవలం ముద్దులు మాత్రమే కాదు ఇంకా చాలా మంచి కథ, కథనం, విషయం ఉన్నాయంటూ హీరోయిన్ హీబ్బా పటేల్ చెప్పుకొచ్చింది.
 
కేవలం టైటిల్ చూసి అలా అనుకుంటారని, ఈ చిత్రం ఆర్ఎక్స్ 100, అర్జున్ రెడ్డి చిత్రాల కన్నా ముందు వచ్చినా కూడా తాను చేసే దాన్ని అంటూ ఈ అమ్మడు వివరించింది. ఇలా ఆ విమర్శలకు హెబ్బా చాలా రొటీన్ గా సమాధానం చెప్పింది. అంతా చెప్పినట్లుగానే తమ సినిమాలో ముద్దు సీన్స్ కథలో భాగమే కాని - తాము బలవంతంగా జొప్పించలేదు అంది. ఇది అంతా చెప్పే రొటీన్ విషయమే. హెబ్బా కూడా రొటీన్ గా అందరిలాగే చెప్పిందా లేదంటే నిజంగానే ఆమె చెప్పినట్లుగా సినిమాలో మ్యాటర్ ఉందో తెలియాలి అంటే సినిమా విడుదలవ్వాల్సిందే.
 


Forum Topics


Top