కొత్త రికార్డు సృష్టించబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు...!

కొత్త రికార్డు సృష్టించబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు...!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలు ఓవర్సీస్ లో మంచి కలెక్షన్లు రాబడుతయి. సినిమా ఎంత దారుణంగా ఫ్లాప్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన..రికార్డు లు సృష్టించే విధంగా ఉంటాయి. అనేకసార్లు ఫ్లాప్ సినిమాలతోనే మహేష్ బాబు యూ ఎస్ లో మిలియన్ డాలర్ కాసుల వర్షం కురిపించారు. ముఖ్యంగా మహేష్ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి రాని విధంగా ఓవర్సీస్లో రావటం విశేషం. మరియు అదే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా మహేష్ మాత్రమే వందల కోట్లు చేసే హీరో అని మహేష్ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఎందుకంటే మహేష్ యొక్క ట్రాక్ రికార్డు చూసుకున్నట్టయితే గత రెండు సినిమాలు అయిన "స్పైడర్" మరియు "భరత్ అనే నేను" చిత్రాలు దాదాపు 100 కోట్ల పైబడి బిజినెస్ జరిగినవే..అయితే ఇప్పుడు భరత్ అనే నేను చిత్రం బ్లాక్ బస్టర్ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న "మహర్షి" చిత్రం మీద కూడా అంతకు మించి అంచనాలు నెలకొన్నాయి. దీంతో 'మహర్షి' సినిమా కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ లో వంద కోట్లు సాధించడం ఖాయమని మహేష్ హ్యాట్రిక్ కొట్టడం తధ్యమని ఇదొక అరుదైన రికార్డు అని మహేష్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top