ఆ హిట్లు ఏమిటి ? ఈ డిజాస్టర్లు ఏంటి ?

By Xappie Desk, November 20, 2018 14:50 IST

ఆ హిట్లు ఏమిటి ? ఈ డిజాస్టర్లు ఏంటి ?

ఇండస్ట్రీలో ఓడలు బండ్లు కావడం బండ్లు ఓడలు కావడం సర్వసాధారణం అనేది తెలిసిందే. అయితే ఈ సామెతకు సరైన ఉదాహరణగా నిలిచింది టాలీవుడ్ లోని సదరు ప్రముఖ నిర్మాణ సంస్థ. ఈ ఏడాది ఆరంభంలో “రంగస్థలం” లాంటి పెద్ద హిట్ తో ఘనంగా ప్రారంభించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, తర్వాత మరో రెండు హిట్లతో వరుసగా హ్యాట్రిక్ సాధించింది. వీరి జోరు చూసి ఇతర నిర్మాణ సంస్థలు తెగ కుల్లుకున్నాయి. అదీ కాకుండా స్టార్ హీరోలంతా ఆ బెనర్లోనే సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపించారు.
 
అయితే ఆ హిట్టు రికార్డు రెండు వారాల వ్యవధిలో మరుగున పడి, మైత్రి మూవీ మేకర్స్‌ కూడా అన్ని సంస్థల్లానే అన్నట్టయింది. వరుసగా మూడు పెద్ద హిట్లు ఇచ్చిన ఈ సంస్థ రెండు వారాల వ్యవధిలో రెండు పెద్ద డిజాస్టర్లని చవిచూసింది. ఒక వైపు పెద్ద సినిమాలు చేస్తూ ఇంకొకవైపు చిన్న, మీడియం సినిమాలతో బ్యాలెన్స్ చేద్దాం అన్న వారి వ్యూహం బెడిసికొట్టింది. మొదటి దెబ్బ సవ్యసాచితో తగిలితే, రెండవ గాయాన్ని అమర్‌ అక్బర్‌ ఆంటొని చేసింది. రెండు సినిమాలు కూడా బయ్యర్లకి తీవ్ర నష్టాలు మిగిల్చినవే కావడంతో మైత్రి ట్రాక్‌ రికార్డ్‌ బాగా ఎఫెక్ట్‌ అయింది. ఇదిలా ఉండగా, ఆ బేనర్ నుండి తర్వాత వస్తున్న చిత్రాలు 'చిత్రలహరి', 'డియర్ కామ్రేడ్'. మరి ఈ ఫాల్‌ నుంచి వారు తిరిగి ఎలా పైకి లేస్తారనేది చూడాలి మరి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Top