నిత్య పైన అమ్మ అభిమానుల ఆగ్రహం ?

నిత్య పైన అమ్మ అభిమానుల ఆగ్రహం ?

ఇప్పుడు కొనసాగుతున్న ఈ బయోపిక్ ల ట్రెండ్ లో ప్రముఖ సినీ, రాజకీయ నాయకుల జీవిత చిత్రాలు త్వరలోనే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఈ వరసలో ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లు ఉన్నాయి. అయితే తమిళుల ఆరాధ్య దైవం, ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయలలిత గారి జీవిత చరిత్ర త్వరలో పట్టాలెక్కనుంది. నిజానికి ఎన్టీఆర్ - వైయస్సార్ బయోపిక్ లను మించిన క్రేజు ఈ బయోపిక్ కి నెలకొందన్న మాటా తమిళనాడులో వినిపిస్తోంది. 'ది ఐరన్ లేడి- ఏ స్టోరి ఆఫ్ రివల్యూషనరీ లీడర్` పేరుతో తెరకెక్కుతున్న అమ్మ జయలలిత బయోపిక్ లో ఎవరు నటిస్తున్నారు? అంటే.. ఇప్పటికే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చేసింది.
 
ఇందులో జయలలిత పాత్రను నిత్యా మీనన్ పోషించబోతోంది. ఇందుకోసం ఆమె అచ్చం జయలలిత పా కనిపించేందుకు మరింత బొద్దుగా తయారవుతోంది. అయితే జయలలిత మీద ఎనలేని ప్రేమాభిమానాలు చూపించే మన తమిళ తంబీలు, ఆ చిత్రంలో ఏదైనా తేడా వస్తె పరిస్థితిలు కూడా మార్చేస్తారు. కావున దర్శకుడితో పాటు నిత్యామీనన్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చిత్రీకరణ సిద్ధం అవుతున్నారట. ఇదే విషయమై, నిత్యా ముందు అతి పెద్ద సవాలు ఉందని సీనియర్ దర్శకుడు - ప్రముఖ హీరో బయోపిక్ తెరకెక్కిస్తున్న పెద్దాయన విశ్లేషించడం విశేషం. మద్రాసు పరిశ్రమతో అనుబంధం ఉన్న సదరు దర్శకుడు తేడాలొస్తే తంబీలు కొడతారు అని అన్నారంటే అర్థం చేసుకోవాలి.
 
తమిళనాడులో జయలలిత గారిది ఎనలేని ప్రస్థానం. ఏకంగా ఆరు సార్లు ఆమె సీఎం కుర్చీని ఎక్కారు. దీనిని బట్టే ఆమెకు అక్కడున్న ఆదరణను అర్థంచేసుకోవాలి. అలాంటి డైనమిక్ లీడర్ ని వేరొకరిని చూడలేదని అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్యామణి హిల్లరీ క్లింటన్ పొగిడేశారంటేనే అర్థం చేసుకోవచ్చు. నాలుగు రాష్ట్రాల్ని గజగజలాడించిన వీరప్పన్ ని అంతమొందించిన స్టార్ పొలిటీషియన్ గా అమ్మ పేరు చరిత్రకెక్కింది. అయితే ఇక్కడ నిత్య మీనన్ టాలెంట్ గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. అయినా ఎలాంటి పరిస్థితుల్లో అమ్మ పాత్ర తగ్గితే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి అని నిత్యకి ఇప్పటికే తెలుసుకుంటది. ఈ చిత్రం జయలలిత జయంతి, ఫిబ్రవరి 24న షూటింగ్ మొదలు కాబోతోంది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top