రజినికి ఇదే ఆఖరి ఛాన్స్..!

రజినికి ఇదే ఆఖరి ఛాన్స్..!

సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు వింటేనే తమిళనాడులో సినీ అభిమానులు పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. అతను అక్కడే కాకుండా టాలీవుడ్ లో కూడా ఎనలేని క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కానీ దాదాపు రెండు దశాబ్దాల కాలం నుండి అతను తీసిన చిత్రాల్లో టాలీవుడ్ లో మెరిపించినవి వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ‘నరసింహ’.. ‘చంద్రముఖి’.. ‘శివాజీ’.. ‘రోబో’ మాత్రమే ఆడాయి. వీటికి రెండు మూడు రెట్లలో సినిమాలు తుస్సుమన్నాయి. అందులోనూ గత దశాబ్ద కాలంలో రజనీ సక్సెస్ రేట్ బాగా పడిపోయింది. ఒక్క ‘శివాజీ’ మినహా సినిమాలన్నీ దారుణ ఫలితాన్ని చవిచూశాయి.
 
రోబో లాంటి అతి పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత రజనీకాంత్ సినిమా మీద అంతటి అంచనాలు పెట్టుకుంటే, ఆ తర్వాత వచ్చిన కబాలి సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. తమిళనాడులో భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టిన ఆ చిత్రం తెలుగులో మాత్రం తుస్సుమంది. అయితే అదే దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన కాలా కూడా అంతంతమాత్రంగానే ఆడింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆ చిత్రం కమర్షియల్ గా విఫలమయింది. సూపర్ స్టార్ సినిమా అంటేనే జూదంగా మారిపోయింది. రజనీ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వచ్చే లాభాలతో పోలిస్తే.. టాక్ తేడా కొడితే నష్టాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.
 
ఇటువంటి నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ శంకర్ చిత్రీకరించిన రోబో 2.0 పైన రజనీ అభిమానులు గంపెడు ఆశలతో ఉన్నారు. ఈ చిత్రం కానీ బాక్సాఫీస్ వద్ద అలరించకపోతే ఇంక తెలుగునాట రజిని పని అయిపోయినట్లే అని అనుకుంటున్నారు. ఇప్పటికే 80 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడుపోయిన ఈ చిత్రం టాలీవుడ్ లో తిరిగి అంత సంపాదిస్తుందా అన్నది ఇక్కడ ప్రశ్న. శంకర్ పొటెన్షియల్, రజిని స్టార్ డం రెండు కలగలిస్తే అదేమీ పెద్ద మొత్తం కాదు. అయితే బ్లాక్బస్టర్ టాక్ సంపాదించిన అరవింద సమేత అని ముక్కుతూ మూలుగుతూ 80 దగ్గర ఆగిపోయింది. అదే ఈ సినిమా కాని తేడా కొడితే ఇక రజనీకి ఇంక ఇక్కడ ఉనికి ఉండబోదు అనేది మాత్రం స్పష్టం.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top