నెల జీతానికి పనిచేస్తోన్న స్టార్ డైరెక్టర్ - ఇండస్ట్రీ కే అవమానం !

By Xappie Desk, November 22, 2018 10:43 IST

నెల జీతానికి పనిచేస్తోన్న స్టార్ డైరెక్టర్ - ఇండస్ట్రీ కే అవమానం !

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ల హిట్ల గ్రాఫ్ ఓ రేంజ్ లో ఉంటే సదరు డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఆకాశంలో ఉంటుంది..అలాగే అనేక మంది నిర్మాతలు అవకాశాల కోసం ఇంటి ముందు క్యూ కట్టి మరీ వెయిట్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒకప్పుడు వరుస హిట్లు కొట్టిన డైరెక్టర్ ఇప్పుడు దారుణంగా వరుసగా మూడు ఫ్లాపులు పడటంతో పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది..గతంలో సినిమాకి కొన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న సదరు డైరెక్టర్..తాజాగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా దారుణంగా ఫ్లాప్ అవడంతో మార్కెట్ బాగా దెబ్బతినడంతో తాజా చిత్రానికి నిర్మాతలు ఆయనకు రూ. 4.5 లక్షల నెల జీతాన్ని ఇచ్చారని సినీ వర్గాలలో గాసిప్పులు వినిపిస్తున్నాయి. అయితే ఈ డైరెక్టర్ గతంలో కొట్టిన బ్లాక్ బస్టర్ ల రిజల్ట్ పక్క ఇండస్ట్రీలో కూడా వినిపించేది..అంత స్టార్ డైరెక్టర్ పొజిషన్ లో ఉండే సదరు డైరెక్టర్ పరిస్థితి నెలరోజుల జీతాన్ని అందుకునే రెమ్యూనరేషన్ కి పడిపోవడంతో ఇది టాలీవుడ్ ఇండస్ట్రీకి అవమానమని పక్క రాష్ట్రాల ఇండస్ట్రీలకు చెందిన కొంతమంది కామెంట్ చేస్తున్నారు. చివరిగా విడుదలైన  సినిమాకు నిర్మాతలు 23 కోట్ల బడ్జెట్ ఇచ్చారట.. అయినా దర్శకుడు మాత్రం రూ. 21 కోట్లలోనే సినిమాను కంప్లీట్ చేసి పెట్టాడట.   కానీ సినిమా గత చిత్రాల కంటే దారుణంగా ఫ్లాప్ అవడంతో మొదటి షో నుండే నెగటివ్ టాక్ రావడంతో సినిమా రిజల్ట్ అందరికీ అర్థమైపోయింది. దీనితో ఆ డైరెక్టర్ కి మళ్లీ ఫ్లాప్ రావడంతో ఇక ఇండస్ట్రీలో నుండి సదరు డైరెక్టర్ దుకాణం చేసే రోజులు దగ్గరలో పడ్డాయని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు కామెంట్ చేస్తున్నారు.


Forum Topics


Top