టుడే మిస్టరీ : హీరో కెరీర్ సర్వ నాశనం చేస్తోన్న అతని సన్నిహితులు !

టుడే మిస్టరీ : హీరో కెరీర్ సర్వ నాశనం చేస్తోన్న అతని సన్నిహితులు !

సినిమా ఇండస్ట్రీలో వరుస హిట్లు వచ్చినప్పుడు సదరు హీరో ప్రవర్తనలో చాలా మార్పులు వస్తుంటాయి. ఇదే విధంగా తెలుగు సినిమా రంగానికి చెందిన ఓ యువ హీరో సినిమా రంగంలో అడుగుపెట్టడంతోనే భారీ హిట్లు కొట్టి.. ఆ సమయంలో ప్రతి ఒక్కరితో కలుపుకుంటూ పోతూ అందరికీ అందుబాటులో ఉంటూ అనేక సక్సెస్ లు చూడటం జరిగింది. అయితే ఇండస్ట్రీ లో అనేక సక్సెస్ లు రావడంతో పాటు ఫెయిల్యూర్స్ కూడా వస్తుంటాయి ఈ క్రమంలో ఆ రెండిటిని సమానంగా తీసుకున్న వాడు చాల తక్కువ మంది ఉంటారు.
 
సక్సెస్ వస్తే కాలర్ ఎగర వేయకుండా...ఫెయిల్యూర్ వస్తే కృంగిపోకుండా ముందుకు సాగే వాడు ఎప్పుడు కూడా ప్రేక్షకుల మదిని గెలుచుకుంటూ ఇండస్ట్రీలో అనేక మందికి అందుబాటులో ఉంటాడు. ఇదిలా ఉండగా మనం మాట్లాడుకుంటున్న కుర్ర హీరో కి వరుస హిట్లు రావడంతో అతని చుట్టూ అతని పొగిడే వారే ఉండటంతో సక్సెస్ తో వచ్చిన ఇమేజ్ తో ఎవరికీ అందకుండా గతంలో మాదిరిగా కాకుండా చాలా మందికి దూరంగా ఉంటూ వ్యవహరిస్తున్నాడు అని ఫిలిం నగర్ లో తెగ వార్తలు వినబడుతున్నాయి.
 
ఆ యంగ్ హీరోని కలవాలని కానీ లేదా ఏదైనా మాట్లాడాలని - ఆఫర్ ఇవ్వాలని.. రకరకాల ప్రొఫెషనల్ వ్యవహారాల కోసం ఎవరైనా వచ్చినా చుట్టూ కమ్మేసిన ఆ కారు మబ్బును దాటుకుని వెళ్లడం చాలా కష్టమైపోతోందిట. ఆ కారుమబ్బులు మరెవరో కాదు సదరు హీరో సన్నిహితులు...ఇక ఈ మంది మార్బలంలోని అపరిపక్వ మబ్బులో హీరో గారి పీఏ(మేనేజర్) తీరుతెన్నులు అయితే అంతే అరాచకమని చెబుతున్నారు.
 
ఎంతగా అంటే ఆ హీరోకి ఓ పెద్ద ఆఫర్ ఇస్తామని కలిసేందుకు ప్రయత్నిస్తే.. ముందు సదరు పీఏ అందుకు ససేమిరా అంటాడట. ఇంకా కలవాల్సిందే పట్టు పడితే మాత్రం సదరు పీఏకు కొంత డబ్బు చెల్లించక తప్పదు అని ఫిలిం నగర్లో టాక్. దీంతో చాలామంది ఆ యంగ్ హీరో తన చుట్టూ ఉన్న కొటారి నుండి బయటికి వచ్చి గతంలో మాదిరిగా వ్యవహరిస్తే ఇండస్ట్రీలో మంచి రోజులు చూసే అవకాశం ఉంటుందని లేకపోతే తన చుట్టూ ఉన్న సన్నిహితులు అతని ముంచేసే అవకాశం లేకపోలేదని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top