శ్రీదేవి జీవిత రహస్యాలు !

శ్రీదేవి జీవిత రహస్యాలు !

అతిలోక సుందరి శ్రీదేవి మరణం యావత్ భారత చలనచిత్ర రంగన్ని కలచివేసింది. ముఖ్యంగా శ్రీదేవి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు ఎంతగానో షాక్ కి గురయ్యారు. భారతీయ అన్ని సినిమా రంగాలలో నటించిన శ్రీదేవి చాలా సూపర్ డూపర్ హిట్లు కొట్టింది. ప్రస్తుతం ఆమె కూతురు జాన్వి ధడక్ అన్నే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తల్లి శ్రీదేవి లగే సినిమా రంగంలో హీరోయిన్గా రాణించాలని తెగ కృషి చేస్తుంది. ఈ క్రమంలో హీరోయిన్ శ్రీదేవి గురించి ఓ పుస్తకం రెడీ అవుతున్నట్లు ఆమె జీవిత రహస్యాలు అంటూ పుస్తకానికి శ్రీదేవి సీక్రెట్స్ అనే పుస్తకం త్వరలో విడుదల అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.
 
అతిలోక సుందరి శ్రీదేవి కథ పేరుతో ఈ పుస్తకాన్ని సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రచించారు. మద్రాసు పరిశ్రమ నుంచి హైదరాబాద్ లో టాలీవుడ్ వేళ్లూనుకునే క్రమంలో ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ - శోభన్ బాబు వంటి స్టార్ల సరసన శ్రీదేవి నటించారు. ఎన్నో క్లాసిక్ హిట్స్ లో గొప్ప అభినయనేత్రిగా నిరూపించుకున్నారు.
 
ఆ సమయంలోనే శ్రీదేవిని పలుమార్లు పసుపులేటికి ఇంటర్వ్యూలు చేశారు. శ్రీదేవి కెరీర్ ఆద్యంతం అత్యంత సన్నిహితంగా మెలిగిన జర్నలిస్టు ఆయన. దీంతో ఆ సమయంలో శ్రీదేవి తనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటి ప్రపంచానికి తెలియని విషయాలను ఈ పుస్తకంలో పొందు పరిచి విడుదల చేయాలని భావిస్తున్నారు పుస్తక రచయిత సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పసుపులేటి రామారావు. గతంలో కూడా ఈ జర్నలిస్ట్ మెగాస్టార్ చిరంజీవి పై అనేక పుస్తకాలు రచించాడు. అయితే దివంగత శ్రీదేవి పై `అతిలోక సుందరి శ్రీదేవి కథ` పేరుతో విడుదలవుతున్న ఈ పుస్తకం గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top