రజినీకాంత్ సినిమా అంటే చాలు ' పుకార్లు ' !

రజినీకాంత్ సినిమా అంటే చాలు ' పుకార్లు ' !

సినిమా రంగంలో స్టార్ హీరోల పై అనేక పుకార్లు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ఇటీవల రాజకీయ రంగం లోకి ఎంట్రీఇచ్చిన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పై వచ్చిన పుకార్లు భారతీయ సినిమా రంగంలో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. ఇదే క్రమంలో తమిళ మీడియా కూడా ఈ పుకార్లను బాగా ప్రచారం చేయడంతో రజనీకాంత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంటికి విషయం ఏమిటంటే రజనీకాంత్ అనారోగ్యంగా ఉన్నారని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు అని.. పరిస్థితి విషమంగా ఉందని ఇలా వరుసగా తమిళ మీడియా రజినీకాంత్ ఆరోగ్యంపై కథనాలు ప్రసారం చేయడంతో తమిళ సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ రజనీకాంత్ ఆరోగ్యం గురుంచి తెగ చర్చించుకుంటున్నారు. అయితే తన భార్య లత రజినీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్... పూర్తి ఆరోగ్యంగా హుషారుగా కనబడటంతో రజనీకాంత్ పై వచ్చిన వార్తలు అన్ని పుకార్లే అన్ని తేలిపోయాయి.
 
దీంతో రజనీకాంత్ అభిమానులు రజనీకాంత్ అనారోగ్యంపై అనవసరంగా వార్తలు ప్రసారం చేసిన మీడియా చానెళ్లపై తెగ మండిపడుతున్నారు..ఇలాంటివి మా హీరో పై చేస్తే ఊరుకోమని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మరోపక్క రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 2.ఓ సినిమా ఈ నెల 29న విడుదల కాబోతున్న నేపద్యంలో రజనీకాంత్ అభిమానులు 2.ఓ సినిమా గురించి భారీ హడావిడి చేయడం మొదలుపెట్టారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తున్న నేపద్యంలో సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. దీంతో చాలామంది బాహుబలి రికార్డులను 2.ఓ సినిమా పగలగొడుతుంది అని కామెంట్లు చేస్తున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top