వైజాగ్ కి సినిమా పరిశ్రమ?

వైజాగ్ కి సినిమా పరిశ్రమ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో విశాఖపట్టణం లో సినిమా పరిశ్రమ గురించి అనేక వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ అంటే హైదరాబాద్ పట్టణం మాత్రమే వినబడుతుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వీడియో పోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే ఎక్కువగా ఉండటంతో చాలామంది మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినీ పరిశ్రమ స్థాపించాలని చాలామంది ముందుకు వచ్చారు. అయితే ఆంధ్రాలో అధికారంలో ఉన్న పార్టీ సినీ పరిశ్రమ స్థాపించడానికి కొంత అడ్డంకులు సృష్టిస్తోందని ఇటీవల ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి కామెంట్ చేశారు. మరోపక్క ఉత్తరాంధ్ర ప్రజలు వైజాగ్ వాసులు తమ ప్రాంతంలో సినిమా ఇండస్ట్రీ పెట్టాలని అనేక డిమాండ్ చేస్తున్నారు.
 
ఈ క్రమంలో వైజాగ్ ప్రాంతంలో స్టూడియో నిర్మించడానికి చెన్నై రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల స్టూడియో నిర్మించడానికి ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత రామానాయుడు స్టూడియోస్ రెండెకరాల స్థలంలో ఉంది అయితే పక్కనే మూడు మూడు ఎకరాలు జోడిస్తే కచ్చితంగా ఇక్కడ స్టూడియో కట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాత విశాఖ ప్రాంతంలో సినీ ఇండస్ట్రీకి భూముల విలువ ప్రభుత్వం తగ్గించాలని సినిమా ఇండస్ట్రీ నెలకొల్పడానికి ప్రోత్సహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఆంధ్రాలో అధికారంలో ఉన్న ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop