ఈ బలవంతపు పబ్లిసిటీ మాకెందుకు ?

By Xappie Desk, November 27, 2018 09:41 IST

ఈ బలవంతపు పబ్లిసిటీ మాకెందుకు ?

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 2.ఓ. శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ హీరో గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన ఈ సినిమా ఇప్పటికే ప్రీ బిజినెస్ రికార్డు స్థాయిలో చేసింది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ పాటలు మేకింగ్ వీడియోలతో అద్భుతంగా తెలివిగా డైరెక్టర్ శంకర్ సినిమాకి హైప్ వచ్చే విధంగా ప్రమోషన్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.
 
దీంతో ఆల్రెడీ ఈ సినిమాకి హైప్ వచ్చేసిందని..తెలుగులో అంచనాల బీభత్సంగా పెరిగిపోయాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కామెంట్ చేశారు. అనేక భాషలలో విడుదలవుతున్న 2.ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమం తెలుగులో ఉంటుందా అన్న సందేహం ఇటీవల చాలామందికి అనుమానం నెలకొంది...ఇదే క్రమంలో 2.ఓ సినిమాని తెలుగు రాష్ట్రంలో ఎన్ విఆర్ సినిమాస్ విడుదల చేస్తున్న నేపథ్యంలో 2.ఓ సినిమాకి 82 కోట్లు చెల్లించి ఎన్ వి ప్రసాద్ బృందం ఈ చిత్రాన్ని కొనుక్కున్నారు.
 
దీంతో మరో పక్క 2.ఓ సినిమా విజయం విషయంలో కాస్త అటు ఇటు టాక్ లు వస్తున్న క్రమంలో కచ్చితంగా ప్రమోషన్ కార్యక్రమాలు హైదరాబాదు నగరంలో కూడా నిర్వహించాలని ప్రచారం చేయాలని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయబోతున్న ఎన్వీ ప్రసాద్ పట్టుబట్టడం వల్లనే రజనీ-అక్షయ్ టీమ్ ఇటువైపు వచ్చారట..మొత్తం మీద బలవంతంగా హైదరాబాద్ నగరంలో 2.ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో చిత్రబృందం ఇంత బలవంతంగా పబ్లిసిటీ కార్యక్రమం చేయడం..డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా అనే కామెంట్లు చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్.
 


Forum Topics


Top