టుడే మిస్టరీ : సినిమాలకి రాజీనామా చెయ్యనున్న స్టార్ హీరో ?

By Xappie Desk, November 28, 2018 14:02 IST

టుడే మిస్టరీ : సినిమాలకి రాజీనామా చెయ్యనున్న స్టార్ హీరో ?

ఆ హీరో అంటే అందరికీ చాలా ఇష్టం. పెద్దగా యాంటీ అభిమానులు అనేవాళ్ళు ఉండరు ఆ హీరోకు. చిరంజీవి తరవాత అంతగా ఇండస్ట్రీ లో ఎదిగిన హీరోగా మంచి పేరు ఉంది. అలాంటి హీరో ఇప్పుడు సినిమాలకి దూరం అవుదాం అని ఫిక్స్ అయ్యాడు అంటున్నారు. ఆ మధ్య రెండేళ్ళ వరల్డ్ టూర్ కొట్టి మళ్ళీ రీ ఎంట్రీ తో వచ్చిన ఒక స్టార్ హీరో కి వరస డిజాస్టర్ లు తలనొప్పి తెచ్చి పెడుతున్నాయ్ అంటున్నారు. రీ ఎంట్రీ సినిమా హిట్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బులు రాలేదు. దాంతో ఆ హీరో కి మార్కెట్ లేదు అనే విషయం తేలిపోయింది . ఆ తరవాత వరసగా రెండు డిజాస్టర్ లు పడ్డాయి. మళ్ళీ ఒక ఓల్డ్ కామెడీ డైరెక్టర్ తో కుమ్మేద్దాం అనుకున్నాడు, వాళ్ళ కాంబినేషన్ కూడా కేక మరి . . కానీ ఈ సారి కూడా బొక్క బోర్లా పడ్డాడు ఆ హీరో. ఇప్పుడు ఇక సినిమాల మీద విరక్తి తో సినిమా ఇండస్ట్రీ కి రాజీనామా చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు అని తెలుస్తోంది. అందరికీ నచ్చే ఇలాంటి స్టార్ హీరో ఇలాంటి నిర్ణయం తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు అంటున్నారు. ఏదేమైనా ఆ హీరో ఈ నిర్ణయం తీసుకోకపోవడమే బెటర్.
 


Forum Topics


Top