రజినీకాంత్ సినిమాని పైరసీ చేసే దమ్ముందా ?

రజినీకాంత్ సినిమాని పైరసీ చేసే దమ్ముందా ?

ప్రస్తుత రోజుల్లో సినిమా విడుదల అయిన కొద్ది గంటల్లోనే పైరసీ వస్తున్న క్రమంలో ...రజనీకాంత్ తాజా చిత్రం 2.ఓ కి పైరసీ టెన్షన్ పట్టుకుంది. దాదాపు 600 కోట్ల బడ్జెట్టు తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అత్యంత భారీ సాంకేతిక హంగులతో తెరకెక్కిన 2.ఓ పై ఆ సినిమా సృష్టించే రికార్డులపై అనేక అంచనాలు పెట్టుకున్నారు భారతీయ సినిమా ప్రేమికులు. త్రీడీలో ఈ సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నారు డైరెక్టర్ శంకర్. ఈ క్రమంలో ఈ సినిమాని మొదటి రోజు నాడే పైరసీని లిక్ చేస్తామని ఇటీవల సినిమా యూనిట్ కి తమిళ్ రాకర్స్ హెచ్చరించారు. దీంతో సినిమా యూనిట్ ఆన్ లైన్ లో తమిళ్ రాకర్స్ పెట్టే లింకులను వెబ్సైట్లను నిరోధించడానికి ఎప్పటికప్పుడు లింకులను డిలీట్ చేయడానికి ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. దాదాపు ఆరువందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ మీడియా వారికి అనేకమైన విజ్ఞప్తులు చేశారు.
 
ముఖ్యంగా అన్ని మీడియాల్లో జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపైనా ఆయన కాస్త ఆందోళనగానే ఉన్నారన్న సంగతి అప్పుడు అందరికీ అర్థమైంది. అలాగే ఈ చిత్రాన్ని 3డిలో చూస్తే 2డిలో చూసిన దానికంటే పది రెట్లు బెటర్ విజువల్ ఎక్స్ పీరియెన్స్ ని ఆస్వాధిస్తారని శంకర్ అన్నారు. మరోపక్క సినిమా యూనిట్ సినిమా పైరసీ కాకుండా పల్లెటూరు ప్రాంతంలో మరియు దుబాయి దేశం లో సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారట...సినిమాకి సంబంధించి పైరసీ రాకుండా చూడాలని 2.ఓ టీమ్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మరోపక్క రజనీకాంత్ అభిమానులు 2.ఓ సినిమా పైరసీ చేస్తే రజిని దమ్మేంటో మేము చూపిస్తామని సోషల్ మీడియా లో వార్నింగ్ లు ఇస్తున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop