రామ్ గోపాల్ వర్మ దొంగ డ్రామా !

By Xappie Desk, November 29, 2018 13:33 IST

రామ్ గోపాల్ వర్మ దొంగ డ్రామా !

నిన్న మొన్నటిదాకా భైరవగీత సినిమాకు నానా తంటాలు పడుతూ ప్రమోషన్స్ ఇచ్చిన వర్మ, తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పేట్టి, అందులో అనవసరమైన మాటలు మాట్లాడి హైప్ పెంచే ప్రయత్నం చేశాడు. ఇలా ఒక రకంగా అటెన్షన్ తెచ్చుకున్న వర్మ ఇప్పుడు చివరికి భైరవగీత ను 29 నుండి డిసెంబర్ 7కు వాయిదా వేశాడు.
 
2.0తో కావాలనే పోటీ పడుతున్నానని చెప్పి అది పిల్లల సినిమా మాది పెద్దల మూవీ అంటూ విచిత్రమైన పబ్లిసిటీ ఇచ్చిన వర్మ ఈ సారి పోస్ట్ పోన్ కు సాంకేతిక కారణాలు సాకుగా చూపుతున్నాడు. అసలు అక్టోబర్11 కే విడుదల కావల్సిన ఈ సినిమా ఎప్పుడో ఫైనల్ ప్రింట్ ను రెడీ చేసుకుంది. అప్పటినుండి 4 సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు అనౌన్స్ చేసిన డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి. సినిమాలకు ఓపెనింగ్స్ రావడం చాలా కష్టం. ఖచ్చితంగా తన సినిమాను ఆ రోజైనా వదులుతాడా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు వర్మ వాయిదాకు ఆడుతున్న డ్రామా కు కారణాలు మాత్రం స్పష్టం.
 
ముందు నుండి ఎంతో తక్కువ చేసి మాట్లాడిన 2.0 ఇప్పుడు రాష్ట్రంలో అన్నీ స్క్రీన్లను ఊడ్చేసింది. అంత పెద్ద హైదరాబాద్ లోనే భైరవగీత కు ఒకే ఒక్క స్క్రీన్ దొరికింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 2.0 ముందు తనది దూదిపింజె అంత ఉంటుందని తెలిసే మీడియాతో పాటు జనాల దృష్టి తనవైపు వచ్చేలా చేసుకున్నాడు. తీరా అది నెరవేరడంతో భైరవగీత డేట్ మార్చేశాడు. అంతేగా మరి, రోబో ఉన్న ఈ ఊపులో కానీ వర్మ సినిమా విడుదల అయితే ట్రాక్టర్ కింద నిమ్మకాయే దాని పరిస్థితి.
 


Forum Topics


Top