ఇళయరాజా కి మళ్ళీ కోపమొచ్చింది !

ఇళయరాజా కి మళ్ళీ కోపమొచ్చింది !

సినిమా ఇండస్ట్రీలో వెయ్యి సినిమాలకు పైగా అద్భుతమైన సంగీతాన్ని అందించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా. ఇండస్ట్రీ లో ఎంతమంది కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ లు వచ్చిన ఎప్పుడు కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ప్రేక్షకుల మదిలో గెలుచుకున్నారు ఇళయరాజా. ఈ క్రమంలో ఇటీవల ఇళయరాజా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తన పాటల విషయంలో చేసిన కామెంట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
 
గతంలో సుప్రసిద్ధ గాయకుడు ఎస్పి బాలసుబ్రమణ్యం తన అనుమతి లేకుండా లైవ్ కన్సర్ట్ లో పాటలు పాడుతూ రాయల్టి రూపంలో చిల్లిగవ్వ కూడా చెల్లించడం లేదని బహిరంగంగా చెప్పడమే కాక లీగల్ గా నోటీసు పంపి సంచలనం రేపిన రాజా మరోసారి తన పాటలు వాడుకునే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు.
 
తన అనుమతి లేకుండా బయట కమర్షియల్ ప్రోగ్రామ్స్ లో చాలా మంది గాయని గాయకులు సంగీత దర్శకులు తన పాటలను విచ్చలవిడిగా పాడేస్తున్నారని అలా జరిగిన పక్షంలో చర్యలు తీసుకోక తప్పదని మరోసారి హెచ్చరిక జారీ చేసారు. మొత్తం మీద తన పాటల విషయంలో....తన అనుమతులు లేకుండా పాడే వారిపై మరొకసారి ఇళయరాజా తన కోపాన్ని ఈ విధంగా ప్రదర్శించారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top