మిస్టరీ టుడే - తెలుగు బ్యాచిలర్ హీరో - హాట్ హాట్ హీరోయిన్ ప్రేమలో - ఇంట్లోవాళ్ళు నో నో !!

By Xappie Desk, December 04, 2018 19:53 IST

మిస్టరీ టుడే - తెలుగు  బ్యాచిలర్ హీరో - హాట్ హాట్ హీరోయిన్ ప్రేమలో - ఇంట్లోవాళ్ళు నో నో !!

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అడపా దడపా హిట్ లు కొడుతూ ఉండే ఒక పెళ్లి కాని కుర్ర హీరో .. ఒక హీరోయిన్ తో లవ్ లో ఉన్నాడు అనే మాట వినిపిస్తోంది. ఫిలిం నగర్ లో ప్రస్తుతం అందరూ దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. గతం లో ఇద్దరూ కలిసి సినిమాలు కూడా చేసారు , అప్పట్లోనే ఇద్దరి మధ్యనా అఫైర్ ఉండేది అనీ ఆ తర్వాత కాలం లో మంచి ఫ్రెండ్స్ గా మిగిలిపోదాం అనుకున్నారు కానీ ఒకరి అభిరుచులు ఇంకొకరికి నచ్చడం తో రిలేషన్ లో ఉన్నారు అంటున్నారు. ఒక పెద్ద మీడియా సంస్థ అధినేత కి అన్నయ్య కొడుకు అయిన ఈ హీరో, పదేళ్ళ క్రితం అప్పట్లో స్టార్ డైరెక్టర్ - స్టార్ హీరోల సినిమాతో ఇండస్ట్రీ లోనే తక్కువ వయసు లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అమ్మాయి తో లవ్ లో ఉన్నాడు అనే మాట వినిపిస్తోంది. ఇండస్ట్రీ లో ఇవన్నీ కామన్ వ్యవహారాలే కానీ ఇద్దరూ పెళ్లి పీటల వరకూ వెళ్ళే ఆలోచనలో ఉన్నారా లేదా అనేదే సస్పెన్స్ గా మారింది . ప్రస్తుతం ఆ హీరోయిన్ కి తెలుగులో ఆఫర్ లు సున్నా - తమిళ్ లో కూడా బాగా తగ్గిపోయాయి ఈ పరిస్థితి లో పెళ్ళికి సిద్ధమవ్వమని ఇంట్లో వాళ్ళు కూడా ఫోర్స్ చేస్తుంటే ఇక విషయం చెప్పేసింది అనీ వాళ్ళు మాత్రం ససేమిరా అంటున్నారు అని తెలిసింది. మన హీరోగారు వెళ్లి ఒప్పించే ఆలోచనలో ఉన్నారట. హీరో కి అన్నీ తానే అయ్యి చూసుకుంటున్న ప్రొడ్యూసర్ అన్నయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Forum Topics


Top