సినిమాలు ఆపేద్దాం అనుకుంటున్నా తేల్చేసిన కాజల్..!

By Xappie Desk, December 05, 2018 17:08 IST

సినిమాలు ఆపేద్దాం అనుకుంటున్నా తేల్చేసిన కాజల్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ క్రేజ్ ఏర్పరుచుకుని ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన హీరోయిన్ కాజల్. లక్ష్మీకళ్యాణం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కాజల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని మరియు ప్రేక్షకుల హృదయాల్లో పాపులారిటీని అతి తక్కువ కాలంలోనే సంపాదించుకుంది. అప్పట్లో వరుస హిట్లు కొట్టిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి టాలీవుడ్ పై కాంట్రవర్షియల్ కామెంట్లు చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ కి అవకాశాలు తగ్గడంతో కాజల్ కెరియర్ అయిపోయినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ కాజల్ టాలీవుడ్ ఇండస్ట్రీ పై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడంతో చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ అందుకొని తిరిగి తన కెరియర్ కొనసాగించింది.
 
ఈ క్రమంలో ప్రస్తుతం కాజల్ నటించిన కవచం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండటంతో సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న కాజల్ తన ఆరోగ్య పరిస్థితి పై షాక్ కు గురి చేసే నిజాలు వెల్లడించింది. కాజల్ కొన్నాళ్లపాటు “ఆటో ఇమ్యూన్ డిజార్డర్” అనే జబ్బుతో బాదపడినట్లు చెప్పింది. ఆ సమయంలో సినిమాలు ఆపేద్దాం అనుకున్నా అని చెప్పింది. ఈ ఏడాది తొలినాళ్లలో జబ్బుతో బాదపడ్డానని, మూడు నెలల పాటు ముంబైలో ఉన్నానని, ఆ సమయంలో మంచానికే పరిమితం అయ్యానని చెప్పింది. అప్పుడు కొన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకుందాం అనుకున్నప్పటికీ ముందుగానే సినిమాలకు కమిట్ అయినందువల్ల షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చిందని చెప్పింది.


Forum Topics


Top