మహేష్ “మహర్షి” ట్రైలర్..?

By Xappie Desk, December 05, 2018 17:09 IST

మహేష్ “మహర్షి” ట్రైలర్..?

డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ తన 25వ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మహర్షి సినిమా టైటిల్ తో వస్తున్న ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల కాబోతున్న అత్యంత కీలక ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఇప్పటికే ఈ సినిమా పై అనేకమైన ఆసక్తికరమైన వార్తలు..విశేషాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ కెరియర్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై అభిమానుల లోను మరియు అదేవిధంగా ఇండస్ట్రీలోనూ అనేక అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో గతంలో మహేష్ పుట్టినరోజు సందర్భంగా అప్పట్లో ఈ సినిమాకి సంబంధించిన చిన్న వీడియోను విడుదల చేసి హల చల్ చేశారు సినిమా యూనిట్. ఈ క్రమంలో ప్రస్తుతం బయటికి వచ్చిన సమాచారం ప్రకారం “మహర్షి” చిత్రానికి సంబంధించి ఒక వార్త ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది.ఈ చిత్రం యొక్క టీజర్ ను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.అంతే కాకుండా ఫిబ్రవరి నెలలోనే ఈ చిత్రానికి సంబందించిన మొదటి పాటను కూడా విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్న సినిమా యూనిట్ ముందుగా ట్రైలర్ మరియు పాటలతో ప్రమోషన్ కార్యక్రమాలు బిగిన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మహేష్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.


Forum Topics


Top