అంతరిక్షం ట్రైలర్ - తెలుగు సినిమా కి గర్వ కారణం ?

By Xappie Desk, December 09, 2018 15:38 IST

అంతరిక్షం ట్రైలర్ - తెలుగు సినిమా కి గర్వ కారణం ?

వరుణ్ తేజ్ హీరోగా ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అంతరిక్షం 9000 కెఎంపిహెచ్ ట్రైలర్ ఏఎంబి సూపర్ ప్లెక్స్ వేదికగా ఇందాకా విడుదలైంది. ఘాజీతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న సంకల్ప్ రెడ్డి ఈసారి అంతకన్నా బలమైన సంకల్పంతో ఇది రూపొందించినట్టు కనిపిస్తోంది. ఇండియన్ స్పేస్ సెంటర్ లో పనిచేస్తూ రాజీ పడని తన వ్యక్తిత్వం కారణంగా అందులో నుంచి బయటికి వచ్చేస్తాడు దేవ్(వరుణ్ తేజ్). కానీ ఓసారి శాటిలైట్ ప్రయోగం వికటించడంతో మొత్తం సమాచార వ్యవస్థ డేంజర్ లో పడుతుంది.
 
దాన్ని పరిష్కరించడం ఒక్క దేవ్ వల్లే అవుతుందని గుర్తించిన స్పేస్ సెంటర్ అతన్ని వెనక్కు వచ్చేలా చేయడంలో అతని ఫ్రెండ్(అవసరాల శ్రీనివాస్)సహాయం తీసుకుంటుంది. దేవ్ వచ్చి దాన్ని పరిష్కరించేందుకు నడుం బిగిస్తాడు. కానీ అదంత సులభంగా ఉండదు. టీమ్ ని తీసుకుని రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధ పడతాడు. అక్కడికి వెళ్ళాక అసలు సవాళ్లు ఎదురవుతాయి. దేశం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని దేవ్ ఎలా నిలబెట్టుకున్నాడు అనేదే అంతరిక్షం 9000 కెఎంపిహెచ్.
 
కథలో మరీ నవ్యత్వం అనిపించకపోయినా విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఎమోషన్ ని మిస్ కాకుండానే దేశ రక్షణకు సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశాన్ని మరోసారి ఎంచుకున్నందుకు సంకల్ప్ రెడ్డిని మనస్పూర్తిగా అభినందించవచ్చు. జ్ఞాన శేఖర్ కెమెరా నైపుణ్యం రెండు నిమిషాలలోనే ఇంత అమోఘంగా అనిపిస్తే రేపు సినిమాలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రశాంత్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఎలివేట్ అయ్యింది.


Forum Topics


Top