పెళ్లి చూపులు హీరోయిన్ పట్టాలెక్కింది

By Xappie Desk, December 12, 2018 11:43 IST

పెళ్లి చూపులు హీరోయిన్ పట్టాలెక్కింది

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి వచ్చి అగ్రహీరోల్లో ఒక హీరో గా మారిన నాని సినిమాలో కథానాయికగా పెళ్లి చూపులు ఫేమ్ రీతు వర్మ అవకాశాన్ని అందిపుచ్చుకుంది.ఇక వివరాల్లోకి వెళితే ఈ సినిమాని విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేయబోతుండగా. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు.కెమెరామెన్గా పీసీ శ్రీరమ చేయబోతున్నట్టు సమాచారం .ఈ చిత్రం నానికి 24 వ సినిమా దీనికి ఇంకా టైటిల్ నిర్ణయించాల్సి ఉంది.

ప్రస్తుతం నాని తన 23 వ చిత్రం జెర్సీ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తన 24వ చిత్రం ఫిబ్రవరి 19 2019 నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతున్నట్లు గా నాని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.ప్రస్తుతం రీతు వర్మ తమిళ్ లో మూడు చిత్రాలు రిలీజ్ కి సిద్ధం చేస్తుంది. దుల్కర్ సల్మాన్ తో చేసిన కన్నమ్ కన్నం కొలైయిదైతల మరియు విక్రమ్తో చేసిన ధ్రువ నట చిత్రం ఈ నెల ఆఖరి 28న రానున్నాయి.అలాగే తను నటించిన చిన్న చిత్రం వచ్చే సంవత్సరం జనవరి 25 2019 రిలీజ్ కానున్నది. ఈ చిత్రాల ప్రమోషన్లు అయిపోయిన తర్వాత నానితో ఫిబ్రవరిలో జతకట్టనుంది.

విక్రమ్ కె కుమార్ ఇష్క్,మనం,24,హలో చిత్రాలకు డైరెక్షన్ వహించారు.హలో చిత్రం తర్వాత మళ్లీ చాలా గ్యాప్ తీసుకొని రాబోతున్నారు.సో ఈ చిత్రంపై ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.


Forum Topics


Top