సిద్ధమైన శుక్రవారం సందడి

By Xappie Desk, December 13, 2018 10:18 IST

సిద్ధమైన శుక్రవారం సందడి

తెలంగాణ ఎన్నికల హడావిడి ముగిసింది. ఇప్పుడు సినిమాల హడావిడి మొదలైంది. ఈ శుక్రవారం ఏకంగా అయిదు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి.అందులో మూడు స్ట్రైట్ సినిమాలు ,రెండు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. వస్తున్నా మూడు స్ట్రైట్ సినిమాలు యువతను టార్గెట్ చేసేవి కాగా డబ్బింగ్ రెండు చిత్రాలు ఫాంటసీ బ్యాక్ డ్రాప్ కు సంబంధించినవి.
 
అశ్విన్ విరాజ్, రిద్ధి కుమార్ జంటగా నటించిన చిత్రం అనగనగా ఓ ప్రేమ కథ. ఈ చిత్రానికి ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరో చిత్రం హుషారు దీంట్లో తేజస్, దక్ష, ప్రియా వడ్లమాని తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ హర్ష కొనగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మూడవ చిత్రం భైరవ గీత ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి డిసెంబర్ 14న రిలీజ్ కానుంది. రామ్ గోపాల్ వర్మ సమర్పణలో సిద్ధార్థ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుంజయ్, ఇర్రా మోర్ జంటగా నటించారు.
 
మోహన్ లాల్ నటించిన ఒడియన్ చిత్రంతో శ్రీకుమార్ మీనన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మరో డబ్బింగ్ చిత్రం ఆక్వా మాన్ తెలుగులో సముద్ర పుత్రుడిగా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ శుక్రవారం పోలింగ్ బూతులు దగ్గర పార్టీ ఆఫీసు దగ్గర ఉన్న జనాలు సినిమా థియేటర్ల ముందుంటారు.


Forum Topics


Top