ఛాన్స్ కొట్టిన చిన్నది

By Xappie Desk, December 13, 2018 20:10 IST

ఛాన్స్ కొట్టిన చిన్నది

నిధి అగర్వాల్ ఈ చిన్నది పుట్టింది హైదరాబాద్లోనే అయినా పెరిగిందంతా బెంగళూరులో. ఇప్పుడిప్పుడే తనని తాను ప్రూవ్ చేసుకుంటున్న భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ తో ఈమె కలిసి చదివింది.ఈమె తొలి చిత్రంలోనే అక్కినేని గారి వారసుడి తో కలిసి నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఈమె నటన పరంగా పర్లేదు అనిపించినా తన అందం తో కుర్రకారుని తన తో ప్రేమలో పడేలా చేసుకుంది.

ఇప్పుడు నిధి అగర్వాల్ అక్కినేని వారి మరో వారసుని తో తెర పంచుకో పోతుంది. ఈ చిత్రానికి తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా బివిఎస్ఎన్ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 25 జనవరి 2019లో జనాల ముందుకు తీసుకురానున్నారు. ఇంకొన్ని ఈమె సైన్ చేసిన చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నట్లు సమాచారం.

తాజా సమాచారం మేర నిధి అగర్వాల్ తెలుగులో పెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ కి రెండు సినిమాల్లో నటించబోతున్నట్లు గా సైన్ చేసిందని సమాచారం. ఈమె తొలి చిత్రం అనుకున్న మేర విజయాన్ని అందించలేకపోయినా అవకాశాలను మాత్రం తెచ్చిపెడుతుంది.

Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Forum Topics


Top