తెలుగు సినిమా నెత్తిన ప్రతీ శుక్రవారం పడే గుదిబండ ఈ బెల్లం కొండ

By Xappie Desk, December 14, 2018 13:11 IST

తెలుగు సినిమా నెత్తిన  ప్రతీ శుక్రవారం పడే  గుదిబండ ఈ బెల్లం కొండ

ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉండగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో ప్రత్యేకత ఉంటుంది. వాడి పేరు ఎత్తగానే టక్కున ఆ విషయం గుర్తొచ్చేస్తుంది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. ఇదే కోవకు చెందుతాడు మన యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఇంతకీ ఈయన కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏదో ఒక శుక్రవారానికి సినిమాని దింపడమే. ఇక చెప్పినట్లుగానే ఆయనకు ఫలితంతో సంబంధం ఉండదు. వచ్చామా.. సినిమా చేశామా.. జనాల మీదకు వదిలేశామా అన్నట్లు ఉంటది ఇతని వాలకం.
 
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ కొడుకుగా ఆరంగ్రేటం చేసిన ఇతను తన మొదటి సినిమానే టాలీవుడ్లోని అగ్ర హీరోయిన్గా వెలుగొందుతున్న సమంతతో చాలా పేరున్న తారాగణంతో స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో "అల్లుడు శీను" సినిమా చేశాడు. ఇది ఎంతోకొంత కామెడీ వల్ల పర్వాలేదనిపించినా ఇతడికి మాత్రం ఎలాంటి పేరును తేలేకపోయింది. ఆ తర్వాత స్పీడున్నోడు అనే సినిమా తీస్తే పేరుకు తగ్గట్టే థియేటర్లలోకి అంతే స్పీడ్ గా వచ్చి వెళ్ళిపోయింది. అయినా మన బెల్లం బాబు అంతటితో ఆగలేదు. స్టార్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా జగపతిబాబు, శరత్ కుమార్ లాంటి వారితో జయ జానకి నాయక అనే సినిమా చేశాడు. సినిమా బాగానే ఆడిన బోయపాటి కెరీర్లోనే దమ్ము తర్వాత ఇదే వీకెస్ట్ సినిమా. ఏదో ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు కానీ అందులో మన బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టింగ్ చూసి ఆ తర్వాత నుంచి సినిమాలు చూడటం మానేశారంట చాలామంది. ఇంకా అతనిలో తపన పెరిగి ఈ సంవత్సరం మొదట్లో సాక్ష్యం అనే సినిమాతో ముందుకు వచ్చాడు. ఈసారి తన స్టార్ హీరోల ట్రెండును కొనసాగిస్తూ పూజా హెగ్డే హీరోయిన్ గా పెట్టిన ఈ సినిమా దారుణమైన ఫలితానికి థియేటర్లకు వెళ్లిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులే సాక్ష్యం.
 
కానీ ఇతని సినిమలు ఎలా ఉన్నా... అందులో చెప్పుకోదగ్గ అంశాలు ఏందంటే ఈ సన్నివేశం డ్యాన్స్ మరియు వాళ్ళ నాన్న పెట్టే డబ్బులు వల్ల కనబడే ప్రొడక్షన్ వ్యాల్యూస్, ఇంక ప్రేక్షకులకు కన్నీళ్లు తుడిచే స్టార్ హీరోయిన్లు. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఎక్కడ ప్రేక్షకులు తమను మర్చిపోతారనుకున్నాడో ఏమో కాని పోయిన వారం తేజ దర్శకత్వంలో కాజల్ మరియు మెహరీన్ జంటగా కవచం అనే సినిమాని జనాల మీదకు వదిలాడు. ఇక థియేటర్లో ఆ దారుణం నుండి జనాల్ని కాపాడడానికి ఏ కవచం లేకపోయింది. సరే పోనీ ఇన్ని సినిమాలు చేసినా అతని పర్ఫార్మెన్స్ లో ఏమన్నా ఇంప్రూమెంట్ ఉందా అంటే, పేరుకు తగ్గట్టే మన బెల్లంకొండ... బెల్లం కొట్టిన రాయిలాగా ఒక కొండలాగా స్థిరమైన హావభావాలతో ఏదో ప్రేక్షకులు ఆ జన్మ శత్రువులు అయినట్లు సినిమాల్లో ఉంటాడని ట్రాల్స్ మీద ట్రాల్స్ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. కానీ ఏది ఏమైనా ముందుగా చెప్పినట్లు ఈ విలక్షణ నటుడు మాత్రం క్షణం తీరిక లేకుండా కొత్త సినిమాలు చేసే పనిలో బిజీగా ఉంటాడు.
 


Forum Topics


Top