విజయ్ దేవరకొండ ను కలిసిన జగన్

By Xappie Desk, December 15, 2018 13:08 IST

విజయ్ దేవరకొండ ను కలిసిన జగన్

రౌడీ బాయ్ గా క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు తెలుగు లో బిజీ హీరో అయిపోయాడు. నోట తో తమిళ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సంవత్సరం టాక్సీవాలా గీతగోవిందం చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దేవరకొండ. గ్యాప్ తీసుకోకుండా నెక్స్ట్ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సిన చిత్రాలను సిద్ధం చేస్తున్నాడు.

ఈ యువ హీరో కి కథను నెరేట్ చేయడానికి తెలుగులో క్రేజీ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ కాకినాడ లో షూటింగ్ కోసం నివాసం ఉంటున్న హోటల్ కి వెళ్లి మరీ నేరేట్ చేశారని ఆ కథ విజయ్ ని ఎంతో ఆకట్టుకుందని అని తాజా సమాచారం.

పూరి జగన్నాథ్ దూరదర్శన్ కి రెండు డాక్యుమెంటరీ లు చేసే సమయంలో విజయ్ దేవరకొండ తండ్రితో సహచరునిగా పనిచేశారు. ఇప్పుడు ఆ స్నేహబంధం ఏ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కథని నేరేట్ చేసేలా చేసింది.

అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే మనం విజయ్ దేవరకొండ ను పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చూడబోతున్నాం. ప్రస్తుతం పూరి జగన్నాథ్ రామ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు.

Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Forum Topics


Top