భారీ నష్టాలను మిగిలిస్తున్న డైరెక్టర్

By Xappie Desk, December 16, 2018 18:06 IST

భారీ నష్టాలను మిగిలిస్తున్న  డైరెక్టర్

మంచి కథ కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకోకలిగినా టాలెంటెడ్ డైరెక్టర్ ల లో హను రాఘవపూడి ఒకడు. క్వాలిటీ విషయంలో రాజీ లేని ఇతని మనస్తత్వం ఇప్పుడు ప్రొడ్యూసర్ల పాలిట శాపంగా మారింది.

టెక్నికల్ గా తను ఎంత టాలెంటేడో తన మొదటి సినిమా అందాల రాక్షసి చిత్రంలోనే చూపించాడు. తర్వాత వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంతో తానేంటో మళ్లీ నిరూపించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన లై చిత్రం జనాలను అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఈ చిత్రంతో హను రాఘవపూడి ప్రేమ కథలేకాక ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేయగలడు అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ దర్శకుడు పడి పడి లేచే మనసు చిత్రంతో జనాల ముందుకు రానున్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుంది తెలియాలంటే విడుదలయ్యే దాకా ఆగాల్సిందే.

ఇతను చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను రంజింప జేస్తున్న ప్రొడ్యూసర్ల జేబులు ఖాళీ చేస్తున్నాయి. దానికి కారణం కాల్షీట్లు పెరిగిపోవడమే. క్వాలిటీ విషయంలో రాజీ లేని ఇతని మనస్తత్వం ఇతను చేసిన సినిమాల బడ్జెట్లు ను పెంచేస్తుంది. దీనితో వచ్చే దానికంటే పోయేది ఎక్కువైపోయి ప్రొడ్యూసర్లు నిండా మునిగి పోతున్నారు. తను ప్రస్తుతం చేస్తున్న పడి పడి లేచే మనసు చిత్రం బడ్జెట్ కూడా ఇప్పటికే దాదాపు 35 కోట్లు అయింది. ఈ చిత్రం పాటలు టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 35 కోట్ల మేరా లాభాలు అందుకోవాలంటే అంత ఈజీ కాదు.

ఇప్పటికైనా హను బడ్జెట్ ను నియంత్రించే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే తన కెరియర్ త్వరగా ముగిసిపోతుంది.


Forum Topics


Top