యంగ్ హీరోకి అత్త అయినా శ్రియ శరన్

By Xappie Desk, December 17, 2018 09:14 IST

యంగ్ హీరోకి అత్త అయినా శ్రియ శరన్

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ దాదాపు పదేళ్ల పాటు నటించిన పాత్రలతో మన అందరిని మెప్పించింది. ఈ సంవత్సరం మార్చి 20న తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన ఈ ముదురు ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం తగ్గట్లేదు. వచ్చే సంవత్సరం తెలుగు తమిళ భాషలు కలుపుకొని మూడు సార్లు ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో వెంకటేష్,నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ లో వెంకటేష్ కు జోడిగా ఎంపికైంది. ఇందులో నాగచైతన్య కు అత్తగా నటించబోతున్నట్లు ఊహాగానాలు వినపడుతున్నాయి. ఈ చిత్రానికి వెంకీ మామ అనే టైటిల్ ఖరారు చేశారు.ఇందులో చైతు కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతుంది.
 
ఈ చిత్రం సంక్రాంతి తర్వాత నుండి షూటింగ్ కి వెళ్ళనుంది.చిత్ర కథ విని శ్రియా సరన్ సైన్ చేసినట్టు రూమర్లు వినపడుతున్నాయి. అయితే ఇంకా ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏది రాలేదు. ఇప్పటికే వెంకీతో సుభాష్చంద్రబోస్, గోపాల గోపాల చిత్రాల్లో కలిసి నటించింది. ఈ చిత్రంలో వెంకీ తో శ్రీయ జతకడితే వీరిద్దరికి ఇది హ్యాట్రిక్ చిత్రం అవుతుంది.


Forum Topics


Top