మనసులోని మాట బయటపెట్టిన మహేష్ బాబు

By Xappie Desk, December 17, 2018 11:51 IST

మనసులోని మాట బయటపెట్టిన మహేష్ బాబు

మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ గా సినిమాల్లో బిజీగా ఉంటూనే మార్కెటింగ్ రంగంలో కూడా తన మార్కు కనబడేలా ఎన్నో ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అలా తను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నా లాయిడ్ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
 
ఆ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ బాబు ని ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ బాలీవుడ్ ఎంట్రీ గురించి అడగగా ఆయన నేను అక్కడ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాను అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మహేష్ బాబు చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
 
ఎప్పుడో బాలీవుడ్ ఎంట్రీ గురించి మహేష్ బాబు క్లారిటీ ఇచ్చినప్పటికీ మీడియా అదే ప్రశ్న ఆయన ఎదురైన ప్రతిసారీ అడుగుతుంది. అయినా మహేష్ బాబు ఎంతో సహనంగా సమాధానం చెబుతున్నాడు. ఇకనైనా ఈ ప్రశ్నను మీడియా ఆపుతుందా లేదా అనేది మహేష్ బాబు మళ్లీ మీడియా ముందుకు వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
 Top