ఒక్కటి చాలు అంటున్న శర్వా

By Xappie Desk, December 19, 2018 09:13 IST

ఒక్కటి చాలు అంటున్న శర్వా

విభిన్న కథాంశాలతో సంవత్సరానికి ఒకసారి వచ్చిన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటే చాలు అనే పాత తరం సిద్ధాంతాన్ని పాటిస్తున్నాడు మన టాలీవుడ్ హీరో శర్వానంద్. ప్రస్తుతం శర్వానంద్ ఈ నెల 21న విడుదల కానున్న పడి పడి లేచే మనసు చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత శర్వానంద్ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నారు అనే ఆసక్తి అభిమానుల్లో ఇప్పటికే నెలకొంది.
 
సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రంలో శర్వానంద్ హీరోగా నటించాడు. ఈ చిత్రం షూటింగ్ ఈపాటికే కంప్లీట్ అవ్వాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. 2019 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఇందులో శర్వానంద్ 1990లో వైజాగ్ నగరంలో ని గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో సెట్ తాలూకు ఫోటోలు కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చిత్రానికి విరాటపర్వం అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఈ చిత్రం యధార్థ సంఘటనల ఆధారంగా తీస్తున్నట్టు, ఇందులో శర్వానంద్ పాత్ర ఛాలెంజింగ్గా ఉండబోతున్నట్లు సమాచారం. దీని షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ చిత్రం పూర్తయ్యాక సుధీర్ వర్మ నితిన్ తో కలిసి రట్ససన్ తెలుగు రీమేక్ తెరకెక్కించాల్సి ఉంది.


Forum Topics


Top